గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసమని చెప్పి..పలు నియోజకవర్గాల్లో నేతలని మార్చిన విషయం తెలిసిందే. పాత నాయకులని పక్కనబెట్టి కొత్త నాయకులని బరిలో పెట్టారు. గెలుపు తప్పనిసరి కావడంతో జగన్...రాజకీయంగా ఈ స్ట్రాటజీ వాడారు. కొందరు సీనియర్ నేతలని సైడ్ చేసి, యువ నాయకులకు కొన్ని చోట్ల సీట్లు ఇచ్చారు. అయితే అలా జగన్ స్ట్రాటజీ సక్సెస్ అయింది...కొత్త నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటారు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలకు తిరుగులేకుండా పోయింది...దీంతో సీట్లు కోల్పోయిన నేతలు సైతం కాస్త నియోజకవర్గాల్లో సొంత మార్గాల్లో పనిచేయడం మొదలుపెట్టారు.

మొదట్లో వారి ప్రభావం అంతగా లేదు గాని..నిదానంగా వారి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో కలవకుండా వారు సెపరేట్‌గా పనిచేసుకుంటున్నారు. అలా పనిచేసుకోవడానికి కారణం కూడా ఎమ్మెల్యేలే అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు..పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వారి వర్గాలకు ఎలాంటి పదవులు దక్కకుండా చేయడం లాంటి చేస్తుండటంతో, వారు కూడా రివర్స్ అయ్యే పరిస్తితికి వచ్చారు. ఇప్పుడు దాని వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకే కొత్త తలనొప్పులు ఎదురయ్యే పరిస్తితి వచ్చింది.


ఉదాహరణకు గురజాల నియోజకవర్గంలో 2019 ఎన్నికల ముందు వరకు వైసీపీని జంగా కృష్ణమూర్తి నడిపించేవారు. గతంలో ఈయనకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఈయన 2014లో వైసీపీ తరుపున గురజాలలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే మళ్ళీ జంగాని బరిలోకి దింపితే రాజకీయంగా దెబ్బతినాలని చెప్పి జగన్ స్ట్రాటజీ మార్చి కాసు మహేష్ రెడ్డిని పోటీకి దింపి సక్సెస్ అయ్యారు.

అయితే ఎమ్మెల్యేగా కాసు దూసుకెళుతున్నారు...ఆయనకు పోటీగా జంగా కూడా వైసీపీలో పనిచేస్తున్నారు. ఇద్దరు నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి సెపరేట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. దీని వల్ల క్యాడర్‌లో చీలిక వచ్చింది. అటు చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజిని, మర్రి రాజశేఖర్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే...రెండు వర్గాలకు ఏ మాత్రం పడని పరిస్తితి. ఈ రెండే కాదు పలు నియోజకవర్గాల్లో పాత నేతలతో ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: