పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...జిల్లా రాజకీయాలని కాపులు ఎక్కువ ప్రభావితం చేయగలరు. చాలా నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు గెలుపోటములని డిసైడ్ చేయగలరు. ఇందులో ఎలాంటి అనుమానం లేదనే చెప్పొచ్చు. అయితే జిల్లాలో ఉన్న కాపు వర్గం...గత ఎన్నికల్లో వైసీపీ వైపుకు వెళ్లింది..అందుకే జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. ఇప్పుడు సీన్ మారుతుంది....కాపులు వైసీపీకి దూరం జరుగుతున్నట్లు కనిస్తున్నారు...అదే సమయంలో టీడీపీ-జనసేనలకు దగ్గర అవుతున్నారు.

ఇదే క్రమంలో జిల్లాలో కీలకంగా ఉన్న తణుకు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన అదృష్టం ఏంటో గాని..రెండుసార్లు మెగా ఫ్యామిలీ వల్లే ఈయన గెలిచారు. అది ఎలా అంటే 2009లో తణుకులో చిరంజీవి ప్రజారాజ్యం ఓట్లు చీల్చి, టీడీపీకి డ్యామేజ్ చేసింది. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కారుమూరి 1400 ఓట్ల తేడాతో గట్టెక్కేశారు. అప్పుడు తణుకులో ప్రజారాజ్యంకు 47 వేల ఓట్ల వరకు పడ్డాయి.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వల్ల కారుమూరికి కలిసొచ్చింది. తణుకులో జనసేనకు 31 వేల ఓట్ల వరకు పడ్డాయి...ఇలా జనసేన ఓట్లు చీల్చడం టీడీపీకి మైనస్ అయింది. దీంతో టీడీపీపై 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అంటే రెండుసార్లు కాపుల ఓట్లలో చీలిక రావడంతో కారుమూరి బయటపడ్డారు.

కానీ ఈ సారి మాత్రం ఆ అవకాశం వచ్చేలా లేదు...తణుకులో టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు వస్తున్నాయి. కమ్మ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చాలావరకు పికప్ అయ్యారు. కాపు వర్గం మద్ధతు కూడా ఈయనకు పెరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ జనసేన గాని, టీడీపీతో కలిస్తే...ఇక్కడ వైసీపీ ఓటమిని ఆపడం ఎవరి వల్ల కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp