ప్ర‌గ‌తి ర‌థం ప్ర‌జ‌ల నేస్తం ఇదీ తెలంగాణ ఆర్టీసీ నినాదం..అదే రుజువ‌యింది కూడా! ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!


ప్ర‌మాద ర‌హిత ప్ర‌యాణంలో తెలంగాణ ఆర్టీసీ ముందుంది.అంతేకాదు మంచి సేవ‌ల‌కు మంచి లాభాలు అన్న నియ‌మాన్ని నినాదంగా మార్చుకుంది. క‌ష్టాలు పోయి మంచి రోజులున్న‌వి ముందున్న కాలాన అని చాటింపు వేసింది. ఓ నిజాయితీ ఉన్న అధికారి కృషి ఫ‌లిస్తే సంక్రాంతి పండ‌గ ఆర్టీసీ సంస్థ ఓ కొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం దిద్దడం ఖాయం అని నిరూపణ అయింది. సంక్రాంతి వేళ అనూహ్య విజ‌యం ఇది.వంద కోట్ల‌కు పైగా కేవ‌లం వారం రోజుల్లో క‌లెక్ష‌న్లు సాధించి ఆర్టీసీ బండి టాప్ గేర్ లో దూసుకుపోతున్న త‌రుణాన సంస్థ‌కు చెందిన ప్ర‌తి ఒక్క‌రి ఆనందాల‌కు అంతే లేదు. అవ‌ధే లేదు కూడా!




సంక్రాంతి పండుగ నిజంగానే తెలంగాణ ఆర్టీసీ ప్ర‌గ‌తిని మ‌రో మారు ఉన్న‌తీక‌రించింది. ద‌శ దిశ అన్నీతానై న‌డిపింది కూడా! ఈ సారి సంక్రాంతి పండగ కాసుల వాన కురిపించింది. సిరి సంప‌ద‌లు నిజంగానే ఆర్టీసీకి ఒన‌గూరాయి..సంస్థ‌కు ఎండీగా వ‌చ్చిన సజ్జ‌నార్ తీసుకున్న సంస్క‌ర‌ణాయుత చ‌ర్య‌ల్లో భాగంగా ఎన్న‌డూ లేనిది ఇవాళ ఆర్టీసీకి లాభాల పంట‌పండింది. ఈ కృషి ప్ర‌తి కార్మికునిది.. ప్ర‌తి శ్రామికునిది కూడా!



సంక్రాంతి పండ‌గ వేళ తెలంగాణ‌కు కాసుల పంట పండింది అని చెప్ప‌డంలో ఆనందం ఉంది.ఒక సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ స‌జ్జ‌నార్ కృషి ఉంది. అంతేకాదు వంద కోట్ల‌కు పైగా ఆదాయాన్ని కేవ‌లం వారం రోజుల్లోనే సంపాదించిన ఘ‌న‌త ఉంది.అవును! మీరు క‌ష్ట‌ప‌డండి.. మీ విజ‌యాలు మీ గురించి మాట్లాడ‌తాయి అని అంటారే అదే నిజం..ఇప్పుడు క‌ష్టం ఆర్టీసీ కార్మికునిది.. వారం రోజులు ఒక్క‌టంటే ఒక్క ప్ర‌మాదం లేదు.. ఎంతో హాయిగా సొంత ఊళ్ల‌కు వెళ్లి వ‌చ్చారు ప్ర‌యాణికులు. నాలుగు వేల స‌ర్వీసులు అద‌నంగా న‌డిపి, సంస్థ‌కు 107 కోట్ల రూపాయ‌ల ఆదాయం తెచ్చి పెట్టారు.అద‌న‌పు స‌ర్వీసులే కానీ అద‌న‌పు ఛార్జీలు అయితే వ‌సూలు చేయ‌లేదు. ఆ విధంగా ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ గ‌ట్టిపోటీ ఇచ్చింది. ఆ పోరులో ఆ పోటీలో ముందంజ‌లో నిలిచి స్ఫూర్తి అయింది. ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు అందుకుని విజ‌య దుందుభి మోగించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: