పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం మహా రంజుగా సాగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచార వ్యూహాలు కొనసాగిస్తున్నాయి. అయితే.. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే వరుసగా ఇక్కడ కాంగ్రెస్ అధికారం సాధించింది. మరి ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కాంగ్రెస్ వల్ల అవుతుందా అన్న అనుమానం ఉంది. దీనికి తోడు.. కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు మరింత బలహీనపడిందన్న సూచనలు ఉన్నాయి. ఏకంగా సీఎం రాజీనామా చేసి.. కొత్త సీఎంను ఎన్నుకోవడం.. రాజీనామా చేసిన సీఎం కొత్త పార్టీ పెట్టుకుని బీజేపీతో జట్టు కట్టడం అనే అంశాలు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ను అమాంతం నేలకు దించాయి.


కాంగ్రెస్‌ సంగతి ఓకే.. మరి పంజాబ్‌లో అధికారం చేపట్టేదెవరు.. ఈ రాష్ట్రంపై బీజీపే ఆశలు పెట్టుకున్నా.. ఇప్పుడు అక్కడ బీజేపీకి అలాంటి వేవ్‌ లేనేలేదు. ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. ఆప్ మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా సీఎం అభ్యర్థిని కూడా వినూత్నంగా ప్రకటించి.. తానే ప్రధాన పోటీదారు అని చెప్పకనే చెప్పింది. అందుకే.. ఇప్పుడు పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్తనాయి.


కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాల వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ తప్పదని చెబుతున్నారు. అంతే కాదు.. ఎన్నికల ముందు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో చేతులు కలిపినంతా మాత్రాన ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు పంజాబ్‌లో బీజేపీ నాలుగో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ప్రస్తుతానికి పంజాబ్‌లో ఆప్‌ వాగ్ధానాలపైనే బాగా చర్చ జరుగుతోంది.


మరి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఏమేరకు పంజాబ్‌లో సత్తా చూపుతాడో చూడాలి. ఆప్‌  ప్రజల నాడిని బట్టీ హామీలు ఇస్తుందంటున్న కేజ్రీవాల్ అవినీతి, డ్రగ్స్‌ని నిర్మూలిస్తామని రొటీన్ వాగ్దానాలు తాము చేయబోమన్నారు. పంజాబ్‌లో ఏ పార్టీ పుంజుకున్నా.. అధికారం చేపట్టినా.. నష్టపోయేది మాత్రం బీజేపీయే అన్న వాదన అక్కడ బాగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: