తెలంగాణ రాజకీయం చుట్టూ ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జోరుగా సాగుతోంది. ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ తరహా వాతావరణం నెలకొంటోంది. ఒకరిని మరొకరు భరించలేని స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఈ విమర్శల వ్యవహారం.. ఉద్యోగాల వైపు మళ్లింది. రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. అందుకు అనేక సాకులు చెబుతున్నారని బీజేపీ నేతలు బండి సంజయ్ వంటి వారు నిలదీస్తున్నారు.


అయితే.. ఉద్యోగాల విషయంలో అసలు కేంద్రం, తెలంగాణకు పోలికే లేదని హరీశ్ రావు గుర్తు చేశారు. అసలు కేంద్రంలోనే 10.62 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. నిరుద్యోగులపై ప్రేమ ఉంటే ఉద్యోగ భర్తీలు వెంటనే చేపట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైల్వేశాఖలో 3 లక్షలు, సైన్యంలో 2 లక్షల ఖాళీలున్నాయని హరీశ్ రావు అంటున్నారు. తాము రాష్ట్రంలో ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్న హరీశ్‌ రావు.. 317 జీవో వద్దనడమంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దన్నట్టే అంటూ కొత్త భాష్యం చెప్పారు హరీశ్.


అయితే.. అసలు.. 317 జీవోను కేంద్రమే తీసుకువచ్చిందని... కేంద్ర ఉత్తర్వులకు వ్యతిరేకంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయన్న వాదన ఉంది. 317 జీవో అమలైతేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని.. నిరుద్యోగులకు అన్యాయం చేసేవిధంగా బీజేపీ వ్యవహారం ఉంటోందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాన్న ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలకు అనుమతిచ్చారని గుర్తు చేసింది.


అలా మంజూరైన వైద్యశాలల్లో కనీసం ఒక్కటంటే.. ఒక్కటి కూడా తెలంగాణలో మంజూరు చేయలేదు. ఆరోగ్యశాఖ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న హరీశ్‌ రావు..  సంజయ్.. ప్రధాని ఎంపీగా ఉన్న రాష్ట్రం చివరిస్థానంలో నిలిచిందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి..  పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ.. ఓ పెద్ద ఫిగర్‌ను జనం ముందు ఉంచారు ఈ జగన్  ఫ్యాన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: