జ‌గ‌న్ స‌ర్కారు తీసుకు వ‌చ్చిన నూత‌న పీఆర్సీ త‌మ‌కు ఎంత మాత్రం అంగీకారంలో లేద‌ని ఉద్యోగ సంఘాలు పైకి చెబుతున్నా,అదే మాట రాష్ట్ర ప్ర‌గ‌తి సార‌థి జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎందుక‌నో చెప్ప‌లేక‌పోతున్నాయి.గౌర‌వ ముఖ్య‌మంత్రికి స‌మ‌స్య వివ‌రించ‌డంలో విఫ‌లం అవుతున్నాయి.ముఖ్యంగా హౌస్ రెంట్ అల‌వెన్స్ కోత, ఫిట్మెంట్ 23 శాతంగా నిర్ణ‌యిస్తూ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై అంతా పెద‌వి విరుస్తున్నారు.ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక స్థితీ,గ‌తీ అర్థం చేసుకోకుండా ఉద్యోగులు మాట్లాడ‌డం స‌బ‌బు కాద‌ని జ‌గ‌న్ అంటున్నారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి మ‌ధ్యే మార్గంగా పాత ప‌ద్ధ‌తినే కొన‌సాగించి కొత్త పీఆర్సీ ని ర‌ద్దు చేయాల‌ని వీరంతా ముక్త‌కంఠంతో కోరుతున్నారు.ఇందుకు జ‌గ‌న్ స‌మ్మ‌తిస్తారో లేదో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది.ఎలా చూసుకున్నా త‌మ క‌న్నా తెలంగాణ ఉద్యోగులే బెట‌ర్ అన్న భావ‌న‌కు ఇప్ప‌టికే ఉద్యోగులు వ‌చ్చేశారు.ఇక ఇవాళో రేపో స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.ఇదే స‌మయంలో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ అయితే పూనుకోవ‌డం లేదు.


ఆంధ్రావ‌నిలో ఉద్యోగ సంఘాల్లో చీలిక‌లు మొద‌లుకానున్నాయి.ఎందుకంటే పీఆర్సీకి సంబంధించి నాయ‌కులంతా ప్ర‌భుత్వంతో లాలూచీ ప‌డ్డార‌ని అందుకే త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని వీరంతా ఆరోపిస్తున్నారు.కొత్త పీఆర్సీ అమ‌లుకు సంబంధించిన జీఓ కాపీల‌ను ఇప్ప‌టికే చించి వేసి మ‌రీ త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.ఉద్యోగ సంఘ నాయ‌కుల‌ను న‌మ్ముకోవ‌డం త‌మ త‌ప్పు అయింద‌ని మిగ‌తా వ‌ర్గాలు కూడా గ‌గ్గోలు పెడుతున్నాయి.కొంద‌రైతే బండి శ్రీ‌ను (ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్య‌క్షులు) లాంటి వారు అమ్ముడుపోయార‌న్న వాద‌న కూడా వినిపిస్తున్నారు.ఈ త‌రుణంలో ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నాయి.


గ‌తంలో ఉన్న విభేదాలన్నీ ఒక్కొక్క‌టీ తెర‌పైకి తెస్తూ త‌మను నాయ‌క‌త్వాలు ఏ విధంగా మోసం చేశాయో కూడా ప‌దేప‌దే అంత‌ర్మ‌థ‌నం చెందుతూ మీడియా ముందుకు వ‌స్తున్నాయి.ఏ విధంగా చూసుకున్నా తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాలో జీతాలు ప‌ది వేలు క‌న్నా ఎక్కువ వ్య‌త్యాస‌మే ఉంద‌ని,త‌మ క‌న్నా పొరుగు ఉద్యోగులే న‌యం అన్న భావ‌న తో పాటు అందుకు త‌గ్గ గ‌ణాంకాలు కూడా తెర‌పైకి తీసుకువ‌స్తూ వీళ్లంతా త‌మ న్యాయప‌ర‌మైన హ‌క్కుల‌న్నింటినీ కాల‌రాసిన నాయ‌క‌త్వాల‌పై మండిప‌డుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp