ఇప్పటికే రెండు దశల్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిన కరోనా వైరస్ ఇక ఇప్పుడు మూడవ దశలో కూడా విజృంభించేందుకు  సిద్ధమైంది. ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని వైరస్ పై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికి  ఎంతో మంది పై పంజా విసురుతోంది  ఈ మహమ్మారి వైరస్. ఇప్పుడిప్పుడే ఏపీలో కరోనా వైరస్ రెండోదశ ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం ఆందోళనకరంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ ఉండటం గమనార్హం. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో ఇక నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. అంతే కాకుండా ఇక కాస్త లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసుకోవాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. అయితే మొన్నటి వరకు ఎంతో మంది వైరస్ లక్షణాలు కనిపించాయి అంటే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకునే వారు. ఇటీవలి కాలంలో యాంటిజెన్ టెస్ట్ లో కచ్చితమైన ఫలితాలు రావడం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం గమనార్హం.



 అయితే ఇటీవల కాలంలో అందరూ ఆర్టిఫిసియల్ పరీక్షలు చేయించు కుంటున్న సమయంలో మొన్నటివరకు సామాన్యులకు ఈ పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఇబ్బంది గా మారిపోయింది. ఎందుకంటే మొన్నటివరకు ఏకంగా ఆర్ టి పి సి ఆర్  పరీక్షలకు గాను 499 రూపాయలు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆర్ టి పి సిఆర్ ధర రూ.. 350 గా నిర్ణయించింది ప్రభుత్వం. ఇక ఆస్పత్రులు ల్యాబ్ లో తప్పనిసరిగా సవరించిన రేట్లనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇక ప్రభుత్వ ఆదేశాలను కాదని ఎవరైనా ఎక్కువ ధరలు వసూలు చేస్తే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు అంటూ అధికారులు తెలిపారు..  కాగా ప్రస్తుతం తగ్గిన ధరలు సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా మారబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: