ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై తాను అండ‌గా నిలిచి మాట్లాడ‌తాన‌ని చెప్ప‌డంతో రెబ‌ల్ ఎంపీ వాయిస్ ఢిల్లీ టు గ‌ల్లీ వినిపిస్తోంది. వాస్త‌వానికి  వైసీపీ అధినేత ఎవ్వ‌రి మాట వినేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.ముఖ్యంగా ఉద్యోగుల విష‌య‌మై తానేం చేయాల‌నుకున్నానో అదే చేస్తాన‌ని ప‌దే ప‌దే స్ప‌ష్టం చేయ‌డంలో జ‌గ‌న్ ముందున్నారు.అస‌లు ఈ వివాదంలో ర‌ఘురామ త‌ల‌దూర్చ‌డ‌మే శుద్ధ దండ‌గ‌మారి ప‌ని.ఎందుకంటే ఉద్యోగుల స‌మ‌స్య‌పై జ‌గ‌న్ చెప్పినంత స్ప‌ష్టంగా ఏ ముఖ్య‌మంత్రి కూడా చెప్పి ఉండ‌రు.తాను చేయ‌లేని వాటి గురించి అడ‌గ‌వ‌ద్ద‌ని కూడా ఇప్ప‌టికే విన్న‌వించారు జ‌గ‌న్.అయినా గొంతెమ్మ కోర్కెల‌లో భాగంగానే ఉద్యోగులంతా సీఎం ద‌గ్గ‌ర‌కు పోయి అన‌స‌వ‌ర ఒత్తిడి తీసుకుని రావ‌డంతో పీఆర్సీ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.అది కూడా ఆయ‌న అన్య‌మ‌న‌స్కంగానే అంగీక‌రించారు.కానీ ఫిట్మెంట్ 23 శాతం ఇవ్వ‌డాన్ని త‌ట్టుకోలేక రోడ్డెక్కుతున్న ఉద్యోగుల‌కు టీడీపీ నేరుగా మ‌ద్ద‌తు ఇవ్వ‌దు ఇవ్వ‌లేదు కానీ మ‌న రెబ‌ల్ ఎంపీ మాత్రం ఉప‌వాస దీక్ష చేసి వారికి  అండ‌గా ఉంటాన‌ని చెబుతుండ‌డం విశేషం.

పొలిటిక‌ల్ మేలేజ్ కోస‌మా?
విభిన్న వాతావ‌ర‌ణంలో విభిన్న వాద‌న‌ల నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల్లో ఉంటూనే ఉన్నారు. న‌ర‌స‌రావు పేట ఎంపీ స్థానానికి ఎన్నిక‌యిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ జ‌గ‌న్ తో త‌గువు పెట్టుకోనిదే ఆయ‌న‌కు ఆత్మ‌శాంతి ద‌క్క‌డం లేదు.ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలిచే ప్ర‌య‌త్నం చేయ‌డంతో వైసీపీ కూడా విసిగిపోయి ఆయ‌న గురించి మాట్లాడ‌డ‌మే మానుకుంది.మౌనంగా ఉంటూ ఆయ‌నేం చేస్తారో చూడాలన్న అంచ‌నాకు వ‌చ్చేసింది కూడా! తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ను ఇర‌కాటంలో పెట్టేందుకు త‌నకో అవ‌కాశం దొరికింద‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నారు రెబ‌ల్ ఎంపీ.దీంతో పొలిటిక‌ల్ మైలేజ్  పెంచుకోవాల‌ని కూడా చూస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే....
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చారు. ఇటీవ‌లే రాజీనామా ప్ర‌క‌ట‌న చేసి హ‌ల్ చ‌ల్ చేసిన ర‌ఘురామ కొత్త‌గా మ‌రో గొంతుక అందుకున్నారు.తాను ఉద్యోగుల కోసం ఒక రోజు దీక్ష చేస్తాన‌ని చెప్పి సెన్సేష‌న్ అయ్యారు.ఇప్ప‌టికే జ‌గ‌న్ పై కారాలూ మిరియాలూ నూరుతున్న ర‌ఘురామ తాజాగా  ఉద్యోగుల స‌మ‌స్య ఎత్తుకుని వారి నుంచి సానుభూతి పొందేందుకు చేస్తున్న ఎత్తుగ‌డ ఇది అని వైసీపీ అంటున్నా..ఆయ‌న అవేవీ ప‌ట్టించుకోరు.ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు రివ‌ర్స్ పీఆర్సీ ఇచ్చింద‌ని, కొత్త జీఓ కార‌ణంగా వారికి వేత‌నాల్లో న‌ష్టం త‌ప్ప‌ద‌ని,వీటిని నిర‌సిస్తూ తాను ఉప‌వాస దీక్ష చేప‌డ‌తానని అంటున్నారీయ‌న.


మరింత సమాచారం తెలుసుకోండి: