ప్రస్తుతం కరోనా కొత్త రూపాంతరం ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన పంజా విసురుతోంది. చాపకింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి పది మందిలో ఒకరు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అంతగా ప్రభావం చూపడం లేదని కొందరి అభిప్రాయం. కాగా ఇది మును ముందు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇది ప్రమాదకరమైన వైరస్ అని కొందరు నిపుణులు అంటున్నారు. ఏదేమైనా జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కోవిడ్ మరణాలు కూడా పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. భారత్ లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతూ కలవరపెడుతున్నాయి.

నిత్యం కొత్త కేసులు లక్షల్లో నమోదు కావడం కోవిడ్‌ -19 ఉధృతిని చెప్పకనే చెబుతున్నాయి. కానీ దేశంలో చూస్తే కరోనా సెకండ్ వేవ్ సమయం లో కనిపించినంత కరోనా పరీక్షల హడావిడి ఇపుడు అంతగా లేదు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమే చెప్పింది. భారత్ లో కరోనా గణనీయంగా పెరుగుతున్న తరుణంలో కోవిడ్‌-19 పరీక్షలు మెల్లగా తగ్గుతుండటంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఇలా ఉండగా భవిష్యత్తులో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న రోజుల్లో అనేక రకాల కొత్త వేరియంట్స్ పుట్టుకు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

తదుపరి వేరియంట్ రాకను నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి మార్గం లేదని వారు చెబుతున్నారు. అయితే భవిష్యత్ లో రాబోయే కరోనా వైరస్ అనేక రూపాంతరాలు చెందుతున్న కారణంగా స్వల్ప అనారోగ్యానికి కారణమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందన్న నమ్మకం అయితే లేదని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం చెబుతున్న ప్రకారం టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే మళ్ళీ గతంలోలాగా పరిస్థితులు మారినా ఆశ్చర్యపడనక్కర్లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: