ప్రతి మనిషిలో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం సత్తా ఉంటుంది.. కానీ మన ఆలోచన టుడే మనలో ఉన్న ధైర్యాన్ని సగం చంపేస్తూ ఉంటుంది. అవును ఇది నిజమే.. కరోనా వైరస్ సమయంలో ఎవరు మానసికంగా దృఢంగా ఉంటారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ లాంటి సవాళ్లను ఎదుర్కొనీ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ . కరోనా వైరస్ అనే కష్టం వచ్చిందని ఎంతోమంది మనస్తాపం చెందుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇప్పటికైనా ప్రతి మనిషి మేలుకో వలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దేశాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ  వైరస్ బారిన పడినప్పటికీ చికిత్స తీసుకుంటే చాలు.. వైరస్ నుండి బయట పడే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నాను అంటే దాదాపుగా ప్రతి ఒక్కరిపై వైరస్ ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎందుకో కరోనా వైరస్ పై అనుమానాలు అపోహలతో  ప్రాణభయంతో వణికిపోతున్నారు. చివరికి కరోనా వైరస్ సోకక ముందే ప్రాణాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.



 ఇటీవలే చిత్తూరు జిల్లా కుప్పంలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. కరోనా వైరస్ భయం తో యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ ఆచారి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షించగా  పాజిటివ్ అని నిర్ధారణ  అయ్యింది. అయితే కరోనా భయంతోనే ఆసుపత్రిలో నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. కేవలం ఆచారి మాత్రమే కాదు ఇలా కరోనా వైరస్ భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇప్పటికైనా మేల్కొని వాస్తవాలను గ్రహించి కరోనా వైరస్ పై జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ..అనవసరంగా అపోహలకు పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: