ప్రస్తుతం కరోనా వైరస్ కోరలు చాస్తోంది. అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్న వేళ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. వైరస్ తరిమికొట్టే ఒక అద్భుతమైన ఆయుధం వ్యాక్సిన్ అన్నది నమ్ముతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఒకప్పుడు వ్యాక్సిన్ విషయంలో ఎన్నో అపోహలు అనుమానాలు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి అవగాహన రావడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇది కొన్ని దేశాలలో ఇప్పుడు బూస్టర్ డోస్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చింది.



 ఈ కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారు.. బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల ఓమిక్రాన్ ఎంతో సమర్థవంతంగా పోరాటం చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు పరిశోధకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా దేశాలలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. ఇక  ఇజ్రాయెల్లో అయితే ఏకంగా నాలుగవ డోస్ కూడా ప్రజలకు అందిస్తూ ఉండడం గమనార్హం.. ఇక అదే సమయంలో ఓమిక్రాన్ ఎంత ప్రమాదకారి ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నాలుగవ డోస్ టీకా తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ కొత్తగా  వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్  నుంచి మాత్రం పాక్షికంగా మాత్రమే రక్షణ కల్పించబడుతుంది అంటూ ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయం పరిశోధనల్లో వెల్లడయింది అంటూ చెప్పుకొచ్చారు. సెబా మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి పరిశోధనలు జరిపి టీకాలు సురక్షితం సమర్థతను పరిశీలించారు. ఈ క్రమంలోనే  బూస్టర్ డోసు కూడా తీసుకున్న వారికి నాలుగవ డోస్ చేశారు. భిన్నమైన వ్యాక్సిన్లు ఇచ్చి పరిశోధన జరిపారూ. నాలుగు డోస్ ఇచ్చిన తర్వాత బాడీలో యాంటీబాడీలు పెరిగినప్పటికీ అవి ఓమిక్రాన్ నుంచి పాక్షికంగానే రక్షణ కల్పిస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: