ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో జగన్ ప్రత్యర్ధి, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి మాటలు బాగా హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఆయన కడప జిల్లా రాజకీయాలు, వివేకా హత్య కేసులో సంచలన విషయాలు మాట్లాడారు. ఇక వివేకా హత్య కేసుని సి‌బి‌ఐ డీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ నేత దేవి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఇంకా దీనిపై విచారణ నడుపుతున్నారు. ఈ తరుణంలోనే జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డికు కూడా వివేకా హత్యలో ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

ఇక దీనిపై తాజాగా బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శంకర్, అవినాష్‌లకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదని చెప్పి ప్రమాణం చేసే దమ్ముందా అని అడుగుతున్నారు. అలాగే తనని కాపాడకపోతే అవినాష్ బీజేపీలోకి వెళ్లిపోతానని జగన్‌తో అన్నారని, ఆ విషయం వివేకా కుటుంబ సభ్యులకు కూడా తెలుసని రవి ఆరోపించారు. అలాగే అవినాష్ జైలుకెళితే కడపలో రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి...తనని వైసీపీలో రమ్మని ఆహ్వానిస్తున్నారని బీటెక్ రవి చెబుతున్నారు.

 
అంటే బీటెక్ రవికి వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందనమాట. సరే మరి రవి చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటే...అది ఎవరికి క్లారిటీ లేదనే చెప్పాలి. అయితే రవి టోటల్‌గా జగన్ ఫ్యామిలీని ఇరుకున పెట్టడానికి ఒక కథ అల్లారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అసలు అవినాష్‌, జగన్‌ని కలిసి తన కాపాడకపోతే బీజేపీలోకి వెళ్లిపోతానని ఎలా చెబుతారు...అసలు అలా చెప్పారని బయటకు ఎలా వచ్చింది..పైగా అది రవికి ఎలా తెలిసిందంటూ ప్రశ్నిస్తున్నారు. రవి మాటలు పూర్తిగా వాస్తవానికి దూరంగా ఉన్నాయని, పైగా తనని ఏదో వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని చెప్పుకుంటున్నారని, రవి కంటే కడప వైసీపీలో తోపు లీడర్లు ఉన్నారని అంటున్నారు. మరి రవి చెప్పింది కథ నిజమో ఎవరికి సరిగ్గా తెలియదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: