సంక్రాంతి తరువాత దేశ వ్యాప్తంగా పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా జ్వరాల ఉద్ధృతి విపరీతంగా ఉంది.దీంతో మార్కెట్లో మెడికల్ షాపులు అన్నీ కిటకిటలాడుతున్నాయి.డోలో 650 టాబ్లెట్ కు ఇప్పుడు ఎంత క్రేజో!

ఇదే సందర్భంలో వ్యాధి నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం ఎంతగానో శ్రద్ధ వహిస్తోంది.వ్యాక్సినేషన్ పెంచాలని కూడా ఆదేశిస్తోంది.అంతేకాదు ట్రేస్ అండ్ ట్రాక్ అన్నది నిరంతర విధానం కావాలని కూడా కోరుతోంది.ఇదే సందర్భంలో అత్యున్నత న్యాయ స్థానంలో కూడా కరోనా పీడితులు పెరిగిపోతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఓ ఆందోళనకర వాతావరణంలో దేశ న్యాయ వ్యవస్థ ఉంది అందుకు సుప్రీం కూడా మినహాయింపు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.ఇక ముందున్న కాలంలో పరిణామాలు ఎలా ఉండనున్నాయో?

దేశ అత్యున్నత న్యాయ స్థానంలో కరోనా కలవరం రేగింది. విధుల్లో ఉన్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడ అంతా గందరగోళ వాతావరణం నెలకొని ఉంది.ఇప్పటికే కరోనా నివారణకు చర్యలు చేపడుతూ వర్చ్యువల్  హియరింగ్ కు ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులు పనిచేయాల్సి వస్తోంది.ఇదే క్రమంలో ఉన్నత న్యాయమూర్తులు కూడా కరోనా బారిన పడి ఇళ్లకే పరిమితం అవుతున్నారు.దీంతో సుప్రీం దైనందిన కార్యకలాపాలు ఎప్పటికప్పుడు నిలిచిపోతున్నాయి.కోలుకున్న వారు విధుల్లో హాజరయినప్పటికీ సిబ్బంది కొరత మాత్రం ఎక్కువగానే ఉంటుంది.అత్యున్నత న్యాయమూర్తులలో 30మందికి కాను పది మందికి పాజిటివ్ అని తేలింది.అదే విధంగా సుప్రీం సిబ్బందిలో నాలుగు వందల మందికి కరోనా సోకింది.




దీంతో వ్యాధి నిర్థారణ పరీక్షలను ప్రతిరోజూ చేస్తూనే ఉన్నారు. వంద నుంచి రెండు వందల మందికి పరీక్షలు చేసి, సంబంధిత ఫలితాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త శ్రీరామరక్ష అని ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ రమణ మొదలు అంతా అప్రమత్తం అయి విధులు నిర్వరిస్తున్నారు. సంబంధిత ప‌రిణామాల నేప‌థ్యంలో సాధ్యం అయినంత త‌క్కువ సిబ్బందితోనే కోర్టు కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని సుప్రీం వ‌ర్గాలు చెబుతున్నాయి.పౌరులు కూడా బాధ్య‌త‌తో మెలిగి క‌రోనా క‌ట్ట‌డికి యంత్రాంగంతో స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: