అభివృద్ధి వేరు పేకాట వేరు.. మూడు ముక్క‌లాట‌కూ ముడు ముక్క‌ల్లో తేల్చేయ‌డానికి వీలులేని ప‌దానికి ఎంతో తేడా..పాపం! చెట్టు కింద పేకాట ఆడితే న‌న్నేం చేయ‌మంటారు అని చెప్పిన గౌర‌వ మంత్రిని ల‌క్ష్యంగా చేసుకుంటూ రామ్ గోపాల్ వ‌ర్మ అనే సంచ‌ల‌నాత్మ‌క వ్య‌క్తి మాటల యుద్ధం ఒక‌టి మొద‌లు పెట్టారు.ఈ యుద్ధంలో ఆర్జీవీ ఓడిపోయినా వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు కానీ గుడివాడ క్రేజ్ మాత్రం అస్స‌లు త‌గ్గ‌నివ్వ‌కండి నాని గారు..మీకు వీలుంటే మ‌రిన్ని పేకాట క్ల‌బ్బుల‌కు అనుమ‌తులు ఇవ్వండి ఏం కాదు..లేదా ఆ చెట్టు కింద పేకాట రాయుళ్ల‌కే ఆడుకోమ‌ని చెప్పి పోలీసుల‌ను కాప‌లాగా ఉంచండి ఏం కాదు ? మీకంతా మంచే జ‌రుగుతుంది స‌ర్....అని అంటోంది ప‌సుపు పార్టీ ...

అందాల గోవా మ‌రియు అందాల గుడివాడ రెండూ ఒక్క‌టే మీకు తెలియ‌దా? ఆయ‌న చీక‌టి యుగాల నుంచి వెలుగు లోకాల వైపు రారండని చెట్టు కింద పేకాట‌ను, ఏసీ గ‌దుల్లో క్యాసినోను క్యాబ‌రే డ్యాన్సుల‌ను ఏర్పాటు చేయిస్తున్నార‌ని అంటూ విప‌క్షం మండిప‌డుతోంది.ఆ మండిపాటు జ‌గ‌మొండి వ‌ర్శ కూడా యాడ్ అయ్యారు. ఇప్ప‌టికే వివాదాలు రేగుతున్నా కూడా క‌నీసం మాట మాత్రంగా అయినా స్పందించేందుకు వీల్లేకుండా క‌రోనా సోకి హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు మంత్రి నాని.ఇవిగాని తెలిస్తే ఎంత‌గా ఫీల‌యి పోయి, అగ్గి మీద గుగ్గిలం అయిపోతారో?

వివాదాల మంత్రి కొడాలి నానిపై సంచ‌ల‌న ద‌ర్శ‌కులు రామ్ గోపాల్ వ‌ర్మ విరుచుకుప‌డ్డారు.సంక్రాంతి వేళ త‌న సొంత క‌న్వెన్ష‌న్ హాల్ లో క్యాసినో నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వ‌ర్మ త‌న‌దైన శైలిలో మాట్లాడారు.గుడివాడ అభివృద్ధికి మ‌రియు ఆధునికీక‌ర‌ణ‌కు ఎంత‌గానో త‌పిస్తున్న కొడాలి నానిని అర్థం చేసుకోకుండా ఆయ‌న‌పై అభాండాలు వేయ‌డం త‌గ‌ద‌ని త‌న‌దైన విమ‌ర్శ‌లు సంధించారు.వీళ్లంతా అభివృద్ధి విరోధ‌కులు అని, గుడివాడ‌ను కించ‌ప‌రిస్తే గోవాను, ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన లాస్ వేగాస్ ను కూడా కించ‌ప‌రిచిన వారు అవుతార‌ని ప‌రోక్షంగా కొన్ని మాట‌లు వ్యంగ్యాత్మ‌కంగా అన్నారు.దీంతో ఈ వివాదం మ‌రింత రాజుకుంది.గ‌తంలో ఆర్జీవీ ఎవ్వ‌రో నాకు తెలియ‌దు అని చెప్పిన కొడాలి నానికి ఆర్జీవీ త‌న ట్వీట్ల రూపంలో దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp