టీడీపీ-జనసేనల పొత్తు ఉంటే...అటు టీడీపీ నేతలకు, ఇటు జనసేన నేతలకు బెనిఫిట్ అని చెప్పొచ్చు...పొత్తు ఉంటే రెండు పార్టీల నేతలకు కాస్త గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి..లేదంటే తక్కువ ఉంటాయి..ముఖ్యంగా జనసేన నేతలకు బాగా తక్కువగా ఉంటాయి. అయితే పొత్తు లేకపోతే సత్తా చాటాలని చెప్పి పలువురు నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అదే సమయంలో పొత్తు ఉంటే..సీటు దక్కించుకుంటే చాలని అనుకుంటున్నారు. అలా రెండు రకాల ఎత్తుగడలతో జనసేన నేత పితాని బాలకృష్ణ ముందుకెళుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ..గతంలో వైసీపీలో పనిచేశారు. ఇంకా ప్రభుత్వ సర్వీసు ఉన్నా సరే జగన్ టిక్కెట్ ఇస్తానని అన్నారని చెప్పి, ఉద్యోగం వదిలేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. కానీ నిదానంగా పితానిని సైడ్ చేసి పొన్నాడ సతీశ్‌ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో ముమ్మిడివరం సీటు తనకు దక్కదని పితానికి అర్ధమైంది.


అందుకే 2019 ఎన్నికల ముందు పవన్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. చేరిన వెంటనే  పవన్...ముమ్మిడివరం జనసేన టిక్కెట్ పితానికి కేటాయించారు. జనసేనలో ఫస్ట్ కేటాయించిన సీటు కూడా ఇదే...ఇలా సీటు దక్కించుకున్న పితాని 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. కాకపోతే 33 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పితాని గట్టిగానే కష్టపడుతున్నారు.

అయితే ఇక్కడ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం చాలా కష్టం...అదే సమయంలో టీడీపీ గెలవడం కూడా కష్టమే. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ముమ్మిడివరంలో టీడీపీ 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఈ సారి అలా జరగకుండా ఉండాలంటే రెండు పార్టీలు కలవాలి. కాకపోతే సీటు జనసేన గాని దక్కించుకుంటే ఖచ్చితంగా పితానికి లక్కీ ఛాన్స్ దక్కినట్లే అని చెప్పొచ్చు. మరి చూడాలి పితానికి లక్కీ ఛాన్స్ దక్కుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: