రాష్ట్రంలోని విషయాలకు సంబంధించి ఎక్కడో ఢిల్లీలో అదికూడా ఇంట్లో దీక్ష చేస్తే ఏమొస్తుంది ? వచ్చి అమరావతిలోనో లేకపోతే నియోజకవర్గం నరసాపురంలో దీక్ష చేస్తే ఏమైనా వస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఉద్యోగులకు మద్దతుగా నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలోని తనింట్లో దీక్ష చేశారు. తనింట్లో దీక్ష చేస్తే రాజుగారికి ఏమొస్తుంది ? ఏమీరాదు.  చేసిన దీక్షేదో అమరావతిలోనో లేకపోతే భీమవరంలోనో చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.




ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్యోగులు, రాజకీయపార్టీలు, ఆయన అభిమానులు అశేష సంఖ్యలో రాజుగారికి మద్దతుగా నిలబడతారు. వాళ్ళు కూడా రాజుగారితో పాటు దీక్ష చేస్తారు. అప్పుడు కూడా ప్రభుత్వంలో వణుకువచ్చేది. ఎలాగూ ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. తర్వాత ఉపఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేస్తానంటు చాలెంజ్ చేశారు. ప్రతిపక్షాల మద్దతుతో ఉపఎన్నికల్లో నిలబడటం ఖాయం, గెలవటమూ ఖాయమని రాజుగారు తేల్చి చెప్పేశారు.




తాను రాజీనామా చేస్తానంటేనే వైసీపీ వణికిపోతోందట. ఉపఎన్నికల్లో తాను తిరిగి మళ్ళీ పోటీచేస్తానంటు వెన్నులో చలి మొదలైందంటున్నారు. మరి తన విజయంపై అంతటి ధీమా ఉన్నపుడు ఎక్కడో ఢిల్లీలో ఎందుకు కూర్చోవటం. వచ్చి నియోజకవర్గంలోనే దీక్షకు కూర్చుంటే ప్రభుత్వాన్ని వణికించేయచ్చుకదా. నిజానికి రాజుగారు నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారా అని జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో రాజుగారు తిరిగి రెండేళ్ళయ్యింది. ఇంకొంత కాలమైతే అసలు రాజుగారిని జనాలు మరచిపోయినా మరచిపోతారు.




ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలంటే నియోజవర్గంలోకి అడుగుపెట్టాల్సిందే. దెబ్బకు ప్రభుత్వానికి వణుకు తెప్పించాల్సిందే. ఎందులో కూడా తగ్గాల్సిన అవసరమేలేదు. కాబట్టి ఉద్యోగుల సమస్య ఇప్పటితో పోయేదికాదు. కాబట్టి వెంటనే రాజుగారు సీఐడీ నోటీసులకు, విచారణలకు, అరెస్టులకు భయపడకుండా ధైర్యంగా నరసాపురంకు రావాలి. ఒక్క నోటీసుకే భయపడి ఢిల్లీకి వెళ్ళిపోతే రేపు ఉపఎన్నికల్లో ఏమి పోటీచేస్తారు ? ఎలా ప్రచారం చేస్తారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: