డి. శ్రీనివాస్...తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు..దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన నాయకుడు. అలాగే పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చిన నేత. అయితే అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చాక కాస్త స్పీడ్ తగ్గించారు. ఇక కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం కావడం, కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ ఇవ్వడంతో టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అయితే టీఆర్ఎస్‌లోకి వెళ్ళాక రాజ్యసభ పదవి వచ్చింది.

కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలు డీఎస్‌కు కీలకమయ్యాయి. ఈయన ఉన్నది టీఆర్ఎస్‌లో..అటు నిజామాబాద్ ఎంపీగా తన కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేశారు. అలాగే టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తనయ కవిత పోటీ చేశారు. దీంతో డీఎస్ ఎటు పనిచేయకుండా సైలెంట్ అయిపోయారు. అయితే ఎన్నికల్లో అరవింద్ గెలిచారు. అరవింద్ గెలుపుకు డీఎస్ వెనుక బాగానే సహకరించారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. అప్పటినుంచి డీఎస్ టీఆర్ఎస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు.

మరి కాంగ్రెస్‌లో చేరితే తన తనయుడు అరవింద్ పరిస్తితి ఏంటి? నిజామాబాద్‌లో మళ్ళీ బీజేపీ నుంచి గెలవడానికి అవకాశాలు ఉంటాయా? అంటే ఏమో చెప్పలేం...డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. అలాంటప్పుడు నిజామాబాద్‌లో డీఎస్ అనుచరులు కాంగ్రెస్ వైపు వస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డీఎస్‌కు మంచి పట్టు ఉంది. మరి అలాంటప్పుడు అరవింద్‌కు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

కానీ గత ఎన్నికల మాదిరిగా అరవింద్ వరకు డీఎస్ సహకరిస్తారనే డౌట్ కాంగ్రెస్ శ్రేణులకు ఉంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌ కోసం పనిచేసిన సరే, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పరిధి వరకు తన కుమారుడు అరవింద్‌కు పరోక్షంగా సాయం చేయొచ్చని తెలుస్తోంది. మరి ఈ సారి కూడా డీ శ్రీనివాస్..తన వారసుడు ధర్మపురి అరవింద్‌కు సాయం చేస్తారో? లేక పార్టీ కోసం నిలబడాలని చెప్పి వారసుడునే ఓడిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp