మాజీ మంత్రి గంటా రాజకీయాలపై చేసిన ప్రకటన మరో రచ్చకు కారణమవుతుందట. గంటా రూట్ క్లియర్ అయితేనే విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒక స్పష్టమైన పిక్చర్ వస్తుంది. గంటా ప్రతి ఎన్నికకు పార్టీని మారుస్తారన్న విమర్శలకు 2019 ఎన్నికల్లో ఫులిస్టాప్ పెట్టేసారు. ఆయన అప్పటి దాకా తానున్న పార్టీ నుంచే నుంచి పోటీ చేశారు. అయితే యధాప్రకారం నియోజకవర్గాన్ని మాత్రం  మార్చారు, ఆ సెంటిమెంట్ తో గెలిచారు కూడా. అయితే 2024 ఎన్నికలకు గంటా పార్టీని, సీటును కూడా మారుస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్ గా గంటా కాపులకే సీఎం పదవి అంటూ కొంత హడావిడి చేస్తున్నారు. కాపు నేతలతో ఆయన వరుస భేటీలు పెడుతున్నారు.దాంతో గంటా ప్లాన్ ఏంటి అన్నది తెలియక తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ కూడా ఆయన వైపు ఆసక్తిగా చూస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే గంటా సన్నిహితవర్గాల సమాచారం ప్రకారం ఆయన  ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని విడిచి వెళ్లారని అంటున్నారు. ఏపీలో వైసిపి అధికారంలో ఉంది. ఆ పార్టీలో ఆయన చేరుతారని మొదటి రెండేళ్లలో ఊహాగానాలు వినిపించిన, ఇప్పుడు ఆ ఊసే లేదు. ఆ మధ్య గంటా బీజేపీలోకి వెళ్తారని కూడా అన్నారు. ఇక ఈ మధ్య ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని కూడా ప్రచారం మొదలైంది. అయితే గంటా తానున్నచోటనే బాగుందని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఆయనకు చంద్రబాబుతో ఎలాంటి గ్యాప్ కూడా లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా గెలుస్తుందని లెక్కలు కూడా గంటా వద్ద ఉన్నాయట. అందువల్ల ప్రతి ఎన్నికకు ఒక పార్టీ అంటూ తన మీద వస్తున్న విమర్శలకు ఈసారి శాశ్వతంగా ఫులిస్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే గంటా ప్రకటన ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఊహాగానాలకు అంతే లేదన్నది విశ్లేషకుల వాదన. దీంతో గంటా పార్టీ విషయంలో క్లారిటీ ఇచ్చినా మరో రచ్చ తప్పదన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గంటా చూపు ఏ సెగ్మెంట్ వైపూ అంటూ పార్టీ క్యాడర్ లోనే కాక జిల్లా రాజకీయ వర్గాల్లోనూ చర్చలు సాగుతున్నాయంట. దీంతో వచ్చే ఎన్నికల నాటికి గంటా ప్లాన్ ఏంటన్నది తెరపైకి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: