రామ్ గోపాల్ వర్మ.. వెరైటీకీ విచ్చలవిడి తనానికి మారుపేరు.. నా జీవితం.. నా ఇష్టం అన్నది ఆయన పాలసీ.. అయితే.. ఆయన ఎంత కాంట్రావర్శీ మనిషో..అంత ముక్కుసూటి మనిషి కూడా.. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై జగన్ సర్కారు తీరును కడిగిపారేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. అంతే కాదు.. తన సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించి.. మొత్తానికి మంత్రి పేర్ని నానితో పిలిపించుకుని.. సచివాలయంలో చర్చలు జరిపి వచ్చాడు.


అయితే.. ఈ చర్చల  వివరాలపై ఆయనతో టీవీ ఫైవ్ స్టూడియోలో జర్నలిస్టు మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు.  ఈ ఇంటర్వ్యూ విషయంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఆ ఇంటర్వ్యూకు వర్మ తాగి వచ్చాడని.. ఒళ్లు తెలియకుండా మాట్లాడారని.. అంతే కాదు.. టీవీ 5 స్టూడియోలో కనీస మర్యాదలు కూడా పాటించలేదని.. ఆ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ఫీల్ అయ్యారట. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో స్పందించారట.


విచిత్రం ఏంటంటే.. ఇంటర్వ్యూకు వెళ్లి వర్మ.. ఓ దశలో టేబుల్‌పై బూటుకాళ్లు పెట్టి మరీ కూర్చున్నారని విమర్శలు వచ్చాయి. ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు మూర్తి కూడా ఆయన చేష్టలకు చూస్తూ ఉండిపోయారు తప్ప.. దాన్ని అడ్డుకోలేదని నెటిజన్లు స్పందించారట. దీనిపై టీవీ5 జర్నలిస్టు మూర్తి తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు.


రామ్ గోపాల్ వర్మ.. ఆ ఇంటర్వ్యూకు తాగి వచ్చారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మూర్తి అంటున్నారు. అంతే కాదు.. వర్మ తాగి.. బూటు కాళ్లు టేబుల్‌ పై పెట్టి మరీ మాట్లాడరని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందో వివరించారు. వర్మ కాస్త వెరైటీ కదా.. సచివాలయం అంటే.. అంతా తెల్లచొక్కాలేసుకునే నాయకులే కనిపిస్తారు. కానీ వర్మ ఆ రోజు పూలచొక్కా టైపు బట్టలేసుకుని వెళ్లారట. ఈ విషయాన్ని జర్నలిస్టు మూర్తి అడిగితే.. అవును అలాగే వెళ్లాను.. చొక్కా ఏంటి.. నా బూట్లు కూడా అలాగే ఉన్నాయి.. కావాలంటే చూడండి..అంటూ కాళ్లు ఎత్తి బూట్లు చూపించారట. అంతే తప్ప.. వర్మ టేబుల్‌ పై బూట్లు పెట్టలేదని మూర్తి వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

rgv