తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారన్న సంగతి తెలిసిందే.. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా అనారోగ్యం లేదని ఆయన స్వయంగా ప్రకటించారు. తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని.. అంతా చెప్పే రొటీన్ సూచనలే ఆయన కూడా చేశారు. చంద్రబాబు తనకు కరోనా వచ్చిందని ప్రకటించిన ముందు రోజే నారా లోకేశ్‌ కూడా తాను కూడా కరోనా బారిన పడ్డానని ప్రకటించారు.


ఒమిక్రాన్‌ వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి ప్రముఖుల కరోనా వార్తలు కామన్ అయ్యాయి.. అంతేకాదు.. ఒమిక్రాన్ కూడా అంత సీరియస్‌ కాకపోవడంతో పెద్దగా ఇబ్బందులు కూడా రావడం లేదు. అయితే.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఎప్పుడూ లేనిది.. ఏపీ సీఎం జగన్ సైతం చంద్రబాబు గారూ.. మీరు త్వరగా కోలుకోవాలని అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


ఇదంతా రొటీన్‌.. ఇలాంటి కోలుకోవాలనే మెస్సేజులు చాలా మంది పెడుతుంటారు. కానీ.. చంద్రబాబు రేంజ్‌ వేరు కదా.. ఆయన కరోనా నుంచి కోలుకోవాలని.. ఏకంగా ఆ కరోనాను ఎగుమతి చేసిన చైనా దేశం కూడా ఆకాంక్షించింది. అవును.. ఇది అక్షరాలా నిజం.. కోవిడ్ పాజిటివ్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడోంగ్  లేఖ పంపారు.


చంద్రబాబు గారూ.. మీకు కరోనా వచ్చిందన్న వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది.. మీరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోండి.. రిపబ్లిక్ చైనా తరపున మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడోంగ్  తన లేఖలో ఆకాంక్షించారు. ఇప్పుడు ఈ లేఖ చూసి టీడీపీ నేతలు మురిసిపోతున్నారు. దేశంలో ఎందరు మెస్సేజులు పెట్టినా రాని కిక్కు.. ఇప్పుడు చంద్రబాబుకు చైనా నుంచి సైతం సందేశం రావడం చూసి ఆనందపడుతున్నారు. ఇదీ మా చంద్రబాబు రేంజ్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: