అక్కడ ఇంటర్‌ నెట్ మరింత వేగవంతం కానుంది.. మరికొన్ని అదనపు సౌకర్యాలు లభించబోతున్నాయి. ఇందుకు 5జీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడమే కారణం.. ఇంతకీ ఎక్కడ అంటారా.. అదే అగ్రరాజ్యం అమెరికా. అక్కడ 5జీ ఇంటర్‌ నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమెరికా వాసుల స్వప్నం సాకారమైంది. అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలను రెండు సంస్థలు ప్రారంభించాయి. ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం సంస్థలు అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చాయి.


అయితే.. 5 జీ సేవలు ప్రారంభం అయితే.. విమానయాన సంస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే.. ఎయిర్‌పోర్టు సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జీ సర్వీసులను తాత్కాలికంగా ఆపేశాయి.  మిగిలిన చోట్ల మాత్రం 5జీ సేవల్ని ప్రారంభించాయి. ఈ రకంగా ప్రస్తుతానికి విమానాలకు అంతరాయం లేకుండా అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.


బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ఈ రెండు టెలికాం సంస్థలు ముందే చెప్పాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన తమ  విమానాల సమయాలను రీషెడ్యూల్‌ చేశాయి. ఎయిరిండియా కూడా అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నిలిపేసింది. అయితే.. అసలు 5 జీ సేవలకు విమానాలకూ లింకేమిటి అనుకుంటున్నారా..? 5 సేవలు అందించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ, విమానయాన సంస్థల సిగ్నల్స్‌ ఫ్రీకెన్వీ దగ్గరలోనే ఉంటాయట. 5 జీ అందుబాటులోకి వస్తే విమానయాన సిగ్నల్స్‌ సరిగ్గా పనిచేయక.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అనుమానాలు ఉన్నాయి.  


వాస్తవానికి అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచే ప్రారంభం కావాలి. కానీ.. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అమెరికాలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ సంస్థలు..  3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవలు అందించేందుకు రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

5g