2020 నుండి నేటికీ ప్రపంచంలోని దేశాలు అన్నీ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా నుండి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా మహమ్మారి మానవ జాతిని అతలాకుతలం చేస్తోంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇలా దశల వారీగా మానవ జాతిని హరిస్తున్న వైరస్ ను చూడడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. వైద్య రంగానికి ఇదొక సవాలుగా మారింది. వ్యాక్సిన్ లు వేసుకున్నా ఇది ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గత 40 రోజుల నుండి మళ్ళీ గతంలో లాగా కేసులు పెరుగుతుండడం భారత ప్రభుత్వాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

వైరస్ వచ్చిన మొదటి రోజుల్లో లక్షణాలు ఉంటేనే టెస్ట్ లకు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఆ తర్వాత తమతో ఉన్న ఏ వ్యక్తికి అయినా వైరస్ సోకినట్లు తెలిస్తే ఇక అందరూ టెస్ట్ చేసుకుంటున్నారు. అందుకే కరోనా మహమ్మారి ఉందా లేదా అని తెలుసుకోవడానికి వివిధ టెస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి 'ఆర్ టి - పీసీఆర్' టెస్ట్. మాములుగా అయితే ఈ టెస్ట్ ధర జూన్ 2020 సమయంలో రూ. 2900 ఉండేది. దీనితో ప్రైవేట్ ల్యాబ్ లు అన్నీ బాగానే సొమ్ము చేసుకున్నాయి. అయితే ఇది అలా తగ్గుతూ రూ. 499 వరకు వచ్చింది.

ఇపుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఆ ధరను కూడా రూ. 350 కు తగ్గించి పేద వారికి ఊరట కలిగించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ సెక్రటరీ గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ దృవీకరించారు. సంక్రాంతి తర్వాత కరోనా కేసులు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా రోజుకి ఒక లక్ష టెస్ట్ లు చేస్తే మనము ఈ కరోనా వీరు ను స్ప్రెడ్ కాకుండా చేయగలం అని సూచించారు. అందుకే ఈ  'ఆర్ టి - పీసీఆర్' టెస్ట్ ధరను తగ్గించి మంచి పని చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: