62.99 లక్షల మంది రైతులకు రూ.7411.52 కోట్లు జమ చేశామని.. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు, సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్ల నిధులు, నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్ల నిధులు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అత్యల్పంగా   మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు బంధు తో  కేసీఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారని..  రైతు భీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.


వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంభించాలని.. ఉపాధి హామీ ని వ్యవసాయ రంగానికి అను సంధానం చేయాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వ్యవసాయ రంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పంటలకు మద్దతుధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతుధరలకు కొనుగోలు చేయాలి... స్వామినాధన్ కమిటీ సిఫారసులను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం శోచనీయమని.. 60 శాతం మంది జనాభా ఆధారపడిన వ్యవసాయరంగం పట్ల కేంద్రప్రభుత్వ విధానం మారాలన్నారు.  రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందని చెప్పారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: