కొన్ని కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ సిఎం ను అనుసరిస్తున్నారని మీడియా జనం వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టింది.  తాజాగ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని అమలు ఎలా జరుగతుందనే విషమై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఈ విషయం పై క్లారిటి ఇచ్చేశారు. అదేమిటంటే ?

తెలంగాణలోని అన్ని  ప్రభుత్వ పాఠాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల భాష ను బోధించ నున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాగా  ప్రభుత్వ బడుల్లో  ఇంగ్లీషు బోధనను ఏ తరగతి నుంచి  అమలు చేస్తారనే విషయం పై క్లారిటీ రాలేదు. ఒక్కోక్క సంవత్సం ఒక్కో తరగతిలో అమలు చేస్తూ వెళతారని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. మరి కొందరేమో ఆంధ్ర ప్రదేశ్ నమూనాను తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవుతుందని  ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం ఇరవైఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ విషయం పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి క్లారిటీ ఇచ్చే శారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన జరుగుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా... ఎవరైనా మాతృభాషలో విద్యను అభ్యసించాలనుకుంటే అట్టి వారిపై  ప్రభుత్వం బలవంతంగా ఆంగ్ల బోధనను  రుద్దదని స్పష్టం చేశారు. తెలంగాణ లోని ఉపాధ్యాయులకు ఆజిత్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకండా వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం లోగా తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తాని ప్రకటించారు. దశల వారీగా ఈ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. తొలి విడుతలో 3.500 రూపాయలు  వెచ్చిస్తామని  మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: