తెలంగాణలో కాషాయ పార్టీ రూట్ మారింది..ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాటజీ మారుస్తున్నారు...ఓ వైపు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూనే...మరోవైపు బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసిన పెద్దగా యూజ్ లేదనేది బండికి బాగా అర్ధమైంది...ఎందుకంటే క్షేత్ర స్థాయిలో బలంగా లేకుండా ఎంత పోరాడిన ఉపయోగం లేదు. అందుకే ముందు పార్టీని బలోపేతం చేయడమే బండి టార్గెట్‌గా పెట్టుకున్నారు. కేంద్ర పెద్దల సలహాలతో పార్టీలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి బలమైన నాయకుడు ఉండేలా చూసుకుంటున్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో కమలం కొంతవరకు సత్తా చాటితేనే..అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే బీజేపీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. అందుకే రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ స్థానాలకు ఒక సమన్వయ కమిటీని, 12 ఎస్టీ స్థానాలకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం అవ్వడమే లక్ష్యంగా బండి ముందుకెళుతున్నారు.

సరే బీజేపీ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు గాని..ఆ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు రావడం అనేది చాలా కష్టం. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అలాగే కొన్ని సీట్లు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

గత ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎస్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది...కాకపోతే పలువురు ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లాగేసింది..అలా అని ఆ స్థానాల్లో కాంగ్రెస్ బలం తగ్గలేదు. అటు ఎస్సీ స్థానాల్లో బీజేపీకి పట్టు దొరకడం చాలా కష్టం. మామూలుగానే ఎస్సీలు బీజేపీకి కాస్త దూరం. ఇంకా అలాంటప్పుడు బీజేపీకి సత్తా చాటడం కుదరని పని...మొత్తానికైతే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కమలం పార్టీ...కారు, కాంగ్రెస్ పార్టీలని క్రాస్ చేసి ఆధిక్యం దక్కించుకోవడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: