ఇంకా మాటలతో కంటే చేతల్లో దిగితేనే బెటర్ అనే విషయం టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బాగా అర్ధమైనట్లు ఉంది. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా పెట్టుకుని విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చిన రేవంత్...విమర్శలే కాదు, కింది స్థాయి నుంచి టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ని నిలబెట్టాలనే విషయం బాగా తెలుసుకున్నారు. ఏదో రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తే ఫలితం ఉండదని, మండల స్థాయి నుంచి పోరాటం చేయాలని, అక్కడ నుంచే కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకురావాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ దిశగానే రేవంత్ పనిచేయడం మొదలుపెట్టారు.

ఇప్పటికే బీజేపీ యాక్షన్‌లోకి దిగేసింది...ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం...రాష్ట్ర స్థాయిలోనే కాదు, బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని అర్ధం చేసుకుని, ఆ దిశగా పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఆయన వరుసపెట్టి నేతలతో సమావేశమవుతూ...పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు..కొత్త కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రేవంత్ కూడా అదే పని పెట్టుకున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఇక దీని ద్వారానే ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎంత బలం ఉందనే విషయాన్ని అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఎక్కువ సభ్యత్వాలు వచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంటుందనే విషయం అర్ధమవుతుంది. అందుకే ఎక్కడకక్కడ ఎక్కువ సభ్యత్వాలు చేయించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. పనిలో పనిగా మండల, నియోజకవర్గ, పార్లమెంట్ స్థానాల వారీగా నాయకులకు టార్గెట్లు పెట్టారు.

మండలానికి 10 వేలు, నియోజకవర్గానికి 50 వేలు, పార్లమెంట్ స్థానంలో దాదాపు 3 లక్షల వరకు సభ్యత్వాలు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు..అలాగే ఎవరు ఎక్కువ సభ్యత్వాలు చేస్తే..వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని నేతలకు కాస్త ఊపు వచ్చే మాట చెప్పారు. ఇలా రేవంత్ పార్టీ బలోపేతం కోసం నానా ఫీట్లు చేస్తుంటే...సభ్యత్వాలు ఎక్కువ చేయించాలని కాంగ్రెస్ నేతలు పాట్లు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: