ప్రభుత్వ ఉద్యోగుల పై డిమాండ్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని  మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధాకరంగా ఉన్నాయని.. భాష అదుపులో ఉండాలని హెచ్చరించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారని.. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణ లేక సమస్య పరిష్కారమా?? అని ప్రశ్నించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ.  బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడ.. పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దన్నారు  బొత్స సత్యనారాయణ.


ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు... ఆర్ధిక పరిస్థితి వల్ల చేయలేక పోతున్నారని మీరే చెప్పారుగా.. ఇప్పుడీ మాటలు ఏంటి ?? అని ఫైర్ అయ్యారు  మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. ఉద్యోగులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అధికారులు చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని అభ్యంతరాలు ఉంటే కాదని చెప్పండన్నారు  బొత్స సత్యనారాయణ. ఉద్యోగస్తులు ఎవరి ప్రొవేకేషన్ లోకి వెళ్ళవద్దు అని కోరుతున్నానని స్పష్టం చేశారు  బొత్స సత్యనారాయణ. సానుకూలంగా ఉండాలని నేనూ కోరుకుంటున్నానని పేర్కొన్నారు  బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ది పొందాలని అనుకుంటాయని.. ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదని హెచ్చరించారు  బొత్స సత్యనారాయణ.  మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దని నేను కోరుతున్నానన్నారు  బొత్స సత్యనారాయణ.ఇది ఇలా ఉండ గా పిఆర్సి విషయం లో ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఏకమయ్యాయి ఉద్యోగ సంఘాలు.  విజయవాడలో ఓ హోటల్ లో రహస్యంగా సమా వేశమైన ఉద్యోగ సంఘాల అగ్రనేతలు.. సమావేశానికి  బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: