టమాట ధర చుక్కలను తాకింది. గత ఏడాది చివర్లో ఏపీలో కూడా కురిసిన వర్షాలతో టమాటా ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. రైతులకు లాభాలు సామా న్యుల కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాట ధరలు ఆకస్మాత్తుగా నేలచూపులు చూస్తున్నాయి.. మరీ ఎందుకు ధరలు పెరిగాయో తెలుసుకుందామా..?
కొన్ని రోజుల క్రితం వరకు టమాట ధర చుక్కలను తాకింది. గత ఏడాది చివర్లో ఏపీలో కూడా కురిసిన వర్షాలతో టమాటా ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. రైతులకు లాభాలు సామాన్యుల కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాట ధరలు ఆకస్మాత్తుగా నేల చూపులు చూస్తున్నాయి.


 నిన్నమొన్నటి వరకు కిలో 40 నుంచి 50 రూపాయలు ఉన్న టమాట ధర నేడు కిలో పది రూపా యలు అన్నా కొనేవారు కనిపించడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా కుప్ప కూలింది.ప్రస్తుతం కిలో టమాట ధర పది రూపాయలకు పడిపోయింది.దీంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. టమాటా ధర ఇంత తగ్గిపోతుంది అంటూ ఆందోళనలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు,అనంతపురం, కర్నూలు జిల్లా లో టమాట పంట అధికంగా పండుతోంది. గత  సంవత్సరం నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ టమాటా పంట దెబ్బతిన్నది. దీంతో ఆ సమ యంలో టమాటా ధర కిలో 150 వరకు చేరుకుంది. రైతులకు సిరులు, సామాన్యులకు అందని ద్రాక్ష లాగా నిలి చింది. అయితే ఇప్పుడు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రైతుల చేతికి టమాటా పంట  వచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి టమాటా  దిగుమతి ఉండడంతో ఇప్పుడు స్థానిక టమాట పంటకు ధరలు వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో స్థానిక టమాట పంటకు ధరలు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: