ఎక్కడ అవకాశం వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఎల్లోమీడియా వెంటాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో చంద్రబాబునాయుడును జనసేన నేతలు ఏమాత్రం వదిలిపెట్టడంలేదు. ఇపుడు ఎదురవుతున్న ప్రతి సమస్యకు జగన్ తో పాటు చంద్రబాబును కుడా కలుపుకుని ఇద్దరినీ వాయించేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది.




జగన్+చంద్రబాబు ఇద్దరు తోడుదొంగలేనట. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చేసిన హామీలను బొలిశెట్టి గుర్తుచేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని, మెరుగైన పీఆర్సీని ఇస్తానని, ఇళ్ళస్ధలాలు ఇస్తానని ఉద్యోగుల మద్దతుతో జగన్ అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. స్ధానిక ఎన్నికలయ్యేవరకు ఉద్యోగులను కమిటీల పేరుతో మభ్యపెట్టిన జగన్ తన బెస్ట్ ఫ్రెండ్ చంద్రబాబు లాగే యూ టర్న్ తీసుకున్నారంటు బొలిశెట్టి ఎద్దేవాచేశారు. పవన్ కల్యాణ్ కు తెలీకుండానే పార్టీ నేతలు ఇంతగా చంద్రబాబును విమర్శించగలరా ?




ఇద్దరినీ కలిపి ఈ తోడుదొంగల  పాలన మనకు అవసరమా ? అంటు జనాలను బొలిశెట్టి ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ప్రస్తావన వచ్చినా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశంపైన కావచ్చు లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా కావచ్చు. జగన్ తో పాటు చంద్రబాబును కూడా జనసేన నేతలు ఉతికి ఆరేస్తున్నారు. ఒకవైపేమో చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లవ్ ప్రపోజల్ పంపుతున్నారు. ఇదే సమయంలో జనసేన నేతలేమో జగన్, చంద్రబాబు ఇద్దరు తోడుదొంగలే అంటున్నారు.




చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే అది రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే అవుతుందంటు సీనియర్ నేతలు ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. టీడీపీ అంటే ద్రోహుల పార్టీ అని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు లవ్ ప్రపోజల్ పై పవన్ ఏమీ మాట్లాడకుండా ఆప్షన్ అట్టే పెట్టుకున్నట్లు అనుమానంగా ఉంది. మరి ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఏమైనా మాట్లాడుతారేమో చూడాలి. అప్పటివరకు జనసేన నేతలు చంద్రబాబును ఇలాగే ఏకిపారేస్తునే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: