అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ఎన్నికైన‌ ఏడాదికే బైడెన్‌కు షాక్ త‌గిలింది. అప్పుడే ఇక నీవు వ‌ద్దు ముర్రో అంటూ జ‌నం కోడై కూస్తున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేలో 66 శాతం మంది బైడెన్ పాల‌న‌పై అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధ్య‌క్షునిగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌టం లేదంటూ.. వారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతున్న‌ది. అంతేకాదు.. 2024లో మ‌ళ్లీ అధ్య‌క్షునిగా పోటీ చేయ‌వ‌ద్ద‌ని.. మొర పెట్టుకుంటారు.

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప‌నితీరు ప‌ట్ల అక్క‌డి ప్ర‌జ‌లు అంత‌గా సంతృప్తిగా లేరు అని తాజా స‌ర్వేలో వెల్ల‌డి అయింది.  అధ్య‌క్షునిగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నార‌ని భావించే ప్ర‌జ‌ల సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతున్న‌ది. దాదాపుగా 50 శాతం మంది బైడెన్ తిరిగి పోటీ చేయ‌కూడ‌దు అని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. జో బైడెన్ అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది గ‌డ‌వ‌క ముందే.. ఈ త‌రుణంలో నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. అధ్య‌క్ష ప‌ద‌వీని స‌రిగ్గా నిర్వ‌హించ‌డం లేద‌ని మెజార్టీ ప్ర‌జ‌లు బైడెన్‌ను విమ‌ర్శించారు. క‌రోనా మ‌హ‌మ్మారి ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా బైడెన్ గ్రాఫ్ త‌గ్గిపోయిన‌ట్టు తెలుస్తున్న‌ది.

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ఎన్ఓఆర్‌సీ సెంట‌ర్ ఫ‌ర్ పబ్లిక్ ఎఫైర్స్ రీసెర్చ్ క‌లిసి ఈ స‌ర్వే చేప‌ట్టాయి. జో బైడెన్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నార‌ని 43 శాతం మంది ఓటు వేసారు. జులైలో నిర్వ‌హించిన ఇదే త‌ర‌హా స‌ర్వేలో 59 శాతం బైడెన్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసారు. సెప్టెంబ‌ర్ లో ఇది 50 శాతంగా ఉన్న‌ది. క‌రోనా నియంత్ర‌ణ‌లో బైడెన్ ప‌నితీరుపై కూడా అనేక మంది నుంచి అసంతృప్తి వ్య‌క్తం చేసారు. 45 శాతం మంది మాత్ర‌మే క‌రోనా బైడెన్ ప‌ని తీరు సంతృప్తిక‌రంగా స్పందిచారు. 2021 జులైలో 66 శాతం డిసెంబ‌ర్ లో 57 శాతంతో పోలిస్తే.. ఇది చాలా త‌క్కువ‌.

2024 ఎన్నిక‌ల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాల‌ని 28 శాతం మంది మాత్ర‌మే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మాన‌సికంగా సిద్దంగానే ఉంటార‌ని వీరు విశ్వాసం వ్య‌క్తం చేసారు. మ‌రొక‌వైపు 50 శాతం మంది మాత్రం..బైడెన్ మాన‌సికంగా, శారీర‌కంగా సిద్ధంగా ఉండ‌లేరు అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్థిక వ్య‌వ‌స్థ విష‌యంలో 37 శాతం మంది మాత్ర‌మే బైడెన్‌ను మెచ్చుకున్నారు. క‌రోనా వైర‌స్ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌నితీరు ప‌న్ను విధానాలు, అప్గాన్ నుంచి అమెరికా బ‌ల‌గాలు వైదొల‌గ‌డం వంటి అంశాల వ‌ల్ల ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయిన‌ట్టు తెలుస్తున్న‌ది. బైడెన్ అధ్య‌క్షుడు అయ్యాక దేశం ఐక‌మ‌త్యం సాధించింద‌ని 16 శాతం మంది అభిప్రాయం వ్య‌క్తం చేసారు. అమెరికా మ‌రింత విభ‌జ‌న‌కు గురైంద‌ని.. 43 శాతం మంది పేర్కొన్నారు.
 
వైట్ హౌస్‌ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించే స‌త్తా బైడెన్‌కు లేద‌న్న వారు 38 శాతం ఉన్నారు. 28 శాతం మంది మాత్ర‌మే సంపూర్ణ విశ్వాసం చూపారు. 33 శాతం మంది బైడెన్‌ను కొంత‌వ‌ర‌కు న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. అయితే ట్రంప్ అధ్య‌క్షునిగా ఉన్న‌ప్ప‌టితో పోల్చితే బైడెన్ మెరుగైన స్థితిలో ఉన్నారు అని స‌ర్వే పేర్కొన్న‌ది. 2018 ఫిబ్ర‌వ‌రిలో ట్రంప్ ప‌నితీరును 35 శాతం మంది మెచ్చుకోగా.. తాజాగా బైడెన్‌ను 33 శాతం మంది ఆమోదించారు వెల్ల‌డించింది. ఈ స‌ర్వేను బైడెన్ ఆమోదించ‌లేదు. అధ్య‌క్షుని మాన‌సిక ఆరోగ్యంపై అమెరిక‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు అని ప్ర‌శ్నించ‌గా, బైడెన్ వాటిని ఖండించారు. ఈ సర్వేల‌ను నేను న‌మ్మ‌ను అంటూ వ్యాఖ్య‌లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: