రాజుగారికి గోదావరి జిల్లాల వెటకారమే కాదు...తెలివితేటలు కూడా ఫుల్‌గా ఉన్నట్లు ఉన్నాయి. ఇంతకాలం తనదైన శైలిలో వెటకారం చేస్తూ..జగన్ ప్రభుత్వంపై ఎడాపెడా పంచ్‌లు వేస్తున్న రఘురామకృష్ణం రాజు..ఇప్పుడు ఎన్నికల్లో గెలిచే తెలివితేటలని బయటపెడుతున్నారు. అసలు రఘురామ ఎలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు...అసలు ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి చూస్తే.. ముందు మన రాజు గారు, జగన్ ప్రభుత్వం మధ్య ఎప్పటినుంచో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. హస్తినలో కూర్చుని రాజుగారు ఏ విధంగా జగన్ ప్రభుత్వంపై పంచ్‌లు వేస్తున్నారో తెలిసిందే.

అసలు అదేంటి మన పార్టీలో గెలిచి, మన ప్రభుత్వం మీదే పంచ్‌లు వేయడం ఏంటని ఫ్యాన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రాజు గారిపై అనర్హత వేటు వేయించడానికి తీవంగా ట్రై చేస్తున్నారు. సరే అది పెద్దగా వర్కౌట్ కావడం లేదని చెప్పి, ఆయనపై పలు కేసులు పెట్టారు...అవును అవి పెట్టినవే అనుకోవాలి మరి. మధ్యలో ఒకసారి జైలుకు పంపారు కూడా...అయినా సరే రాజు గారు తగ్గేదేలే అంటున్నారు.

సరేలే ఇంకా అనర్హత వేటు వేయించడం మీ వల్ల కాదు గాని...నేనే రాజీనామా చేసేస్తానని రాజుగారు సెలవిచ్చారు. పోనీ ఈలోపు ఏమన్నా ట్రై చేసుకోండీ అని చెప్పి ఫిబ్రవరి 5 వరకు గడువు పెట్టారు. ఆ లోపు ఏమి చేయలేకపోతే తానే రాజీనామా చేసేస్తానని చెప్పేశారు కూడా. అంటే ఇంకా నరసాపురం ఉపఎన్నికే. ఈ ఉపఎన్నికలో గెలవడానికి రాజు గారు ముందే ప్రిపేర్ అయ్యారు. టీడీపీతో సహ మిగిలిన ప్రతిపక్షాల మద్ధతు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆ ధీమాతోనే తాను గెలిచేస్తానని చెబుతున్నారు.

అదే సమయంలో ఉద్యోగుల మద్ధతు పొందేందుకు తాజాగా ఢిల్లీలో ఐదారు గంటలు దీక్ష కూడా చేశారు. టీచర్ల కోసం విద్యార్ధులు పోరాడాలని అన్నారు. అంటే ఎన్నికలు నిర్వహించిదే టీచర్లు, ఇతర ఉద్యోగులు...పైగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజు గారు తెలివిగా ఉద్యోగుల కోసం దీక్ష చేశారన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: