రాజకీయాల్లో ఏ నాయకుడుకైన అసలు టార్గెట్ అధికారమే...అధికారం కోసమే ఏదైనా చేస్తారు..అలాగే అధికారం కోసమే నాయకులు జంపింగులు చేస్తారు. ఇలాంటి జంపింగులు ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో నడుస్తూనే ఉన్నాయి. అలా అధికారం కోసం జంప్ చేసిన నేతలు కూడా అధికారాన్ని బాగా ఉపయోగించుకునే వారు. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బంపర్ ఆఫర్లు కొట్టేసిన విషయం తెలిసిందే. నలుగురు మంత్రి పదవులు కూడా కొట్టేశారు. అసలు జంప్ చేశాక ఆ నేతల పరిస్తితి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు నడిచింది. సరే ఎన్నికల్లో జంపింగ్ నేతలకు ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కానీ అప్పటివరకు అధికారాన్ని బాగానే వాడుకున్నారు.

అయితే ఇప్పుడు వైసీపీలో మాత్రం జంపింగ్ నేతల పరిస్తితి అంత ఆశాజనకంగా లేదనే చెప్పొచ్చు. ఏదో కొంతమందికి పదవులు వచ్చాయి గాని, మిగిలిన వారికి రాలేదు...అలాగే వారికి అధికారం కూడా పెద్దగా ఉపయోగపడుతున్నట్లు కనిపించడం లేదు. మిగిలిన నేతల పరిస్తితి పక్కనబెడితే...జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి మాత్రం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే...కాకపోతే వారు పదవులకు రాజీనామా చేయకుండా, డైరక్ట్ వైసీపీలో చేరకుండా, వైసీపీకి మద్ధతు ఇచ్చారు..అంటే అనధికారికంగా వారు వైసీపీ ఎమ్మెల్యేలు అనమాట.

సరే అనధికారికంగా అయినా సరే ఎలాగోలా ఇబ్బంది లేదు అనుకుంటే కష్టమే..అసలు జంపింగ్ ఎమ్మెల్యేలని తమ నేతలుగా వైసీపీ శ్రేణులు చూడలేకపోతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీతో తమకు సంబంధమే లేదని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. భువనేశ్వరిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో వంశీ..వైసీపీ నేత కాదు అన్నట్లు ఉంది. అటు వాసుపల్లి గణేశ్ సైతం వైసీపీలో ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది.. కరణం బలరాంని కొందరు వైసీపీ నేతలే వ్యతిరేకించే పరిస్తితి. ఇలా టీడీపీని వదిలిన ఎమ్మెల్యేలని తమ నేతలుగా వైసీపీ భావిస్తున్నట్లు కనిపించడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: