ఎంత కాదు అనుకున్న తెలుగుదేశం పార్టీలో కమ్మ నేతల హవా ఎక్కువ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. అలా అని ఇతర వర్గాల వారికి ప్రాధాన్యత ఉండదని కాదు గాని...వేరే వర్గాలకు ప్రాధాన్యత ఉన్నా సరే కమ్మ వర్గం దారి వేరు. అంటే సేమ్ వైసీపీలో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఉన్నట్లు. వైసీపీలో రెడ్డి వర్గం హవా ఏ రేంజ్‌లో ఉంటుందో చూస్తూనే ఉన్నాం...అలాగే ఇతర వర్గాల వారికి కూడా ప్రాధాన్యత ఉంది. కాకపోతే వైసీపీలో రాజకీయంగా బలంగా ఉంది రెడ్డి నేతలే. వారే వైసీపీకి వెన్నెముక లాంటివారు. రెడ్డి నేతల వల్లే దాదాపు ఆరు జిల్లాల్లో వైసీపీకి లీడింగ్ ఉంది.

ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఉన్న రెడ్డి నేతలే..వైసీపీని నిలబెడుతున్నారు...ఈ జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. రెడ్డి నేతలు ఉన్నారు కాబట్టే...ఈ జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. అదే సమయంలో మూడు, నాలుగు జిల్లాల్లో టీడీపీకి కమ్మ నేతల బలం ఎక్కువ. కాకపోతే గత ఎన్నికల్లో కమ్మ నేతలు ఓటమి పాలవ్వడంతో టీడీపీకి డ్యామేజ్ జరిగింది.

 
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో...టీడీపీకి భారీగానే డ్యామేజ్ జరిగింది. ఈ జిల్లాలో ఉన్న కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీలు మినహా మిగిలిన కమ్మ నేతలు ఓడిపోయారు. ఇప్పుడు వంశీ సైతం టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ విషయం పక్కనబెడితే...ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో కమ్మ నేతలే టీడీపీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. వారు స్ట్రాంగ్‌గా అయితేనే టీడీపీ నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటుతుంది.

అయితే మూడు జిల్లాల్లో కమ్మ నేతలు దాదాపు పికప్ అయినట్లు కనిపిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ధూళిపాళ్ళ నరేంద్ర లాంటి నేతలతో పాటు ఇంకా కొందరు కమ్మ నేతలు పికప్ అయ్యారు. ఎన్నికల సమయానికి ఇంకా స్ట్రాంగ్ అయితే మూడు జిల్లాల్లో సైకిల్ సెట్ అయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: