రామ్‌ గోపాల్ వర్మ.. ఈయన ఓ వెరైటీ మనిషి.. సకల కళావల్లభుడు.. ఆయన ఓ సినీదర్శకుడు.. ఓ సినీ నిర్మాత.. సంచలనాలు మాట్లాడతాడు.. పుస్తకాలు రాస్తాడు.. ఇలా ఆయన చేసే పనులు ఎన్నో. అయిే.. ఆయనకు వివాహం అనే సంబధం పెద్దగా పడదు. ఆడా మగా కలిసి ఆనందంగా జీవించడానికి పెళ్లి అనే ముసుగు అవసరం లేదని ఢంకా భజాయించి చెబుతుంటాడు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్, రజనీకాంత్‌ కూతురు ధనుష్‌.. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు.


ఆ తర్వాత ఇటీవల టీవీ సీరియల్‌లో శ్రీ కృష్ణుడుగా పేరు పొందిన నితీశ్ భరద్వాజ్‌ జంట కూడా పెళ్లయిన అనేక సంవత్సరాల తర్వాత మేం కలిసి ఉండలేమని భావించి విడాకులు తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు పెళ్లి గురించి రామ్ గోపాల్ వర్మ గతంలో తమాషా వ్యాక్యాలు చెప్పారు. వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవచ్చు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పూర్తిగా నాశనం చేసే వ్యవస్థే పెళ్లి అంటారు రామ్ గోపాల్ వర్మ.


ప్రేయసీ ప్రియుల మధ్య ఎంత ప్రేమ ఉన్నా.. వాళ్లు దంపతులు అయ్యాక కచ్చితంగా కొట్టుకుంటారని వర్మ అంటున్నాడు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను చంపుతుందని వర్మ ఢంకాభజాయించి మరీ చెబుతున్నాడు. అసలు పెళ్లి అనేదే ఓ ట్రాష్ అని.. అది పెద్దలు మనకు ఇచ్చిన అతి దారుణమైన వారసత్వ భావజాలం అని వర్మ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. అసలు పార్టీ చేసుకోవాల్సింది పెళ్లి చేసుకోవడానికి కాదని.. ఆ పెళ్లి పెటాకులైనప్పుడు మాత్రం అందరితోనూ ఆనందం పంచుకోవాలని వర్మ అన్నారు.


ఇప్పుడు అనేక సెలబ్రెటీల జంటలు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే నాగచైతన్య జంట విడాకులు తీసుకున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య.. వీరితో పాటు టీవీ కృష్ణుడు నితీశ్ భరద్వాజ్‌ విడాకులు.. ఇలా వరుసగా విడాకుల ఘటనలు వార్తల్లోకి వచ్చేసరికి.. ఈ పెళ్లి, విడాకులు అనే అంశాలపై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయలకు ప్రాధాన్యం లభిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: