ఎపీ జేఎసీ, ఎపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ఏపీ జెఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్.  చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయానికి వచ్చామని..  పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్ల కు జీవో ద్వారా నష్టం జరుగుతోందని వెల్లడించారు.  ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని.. సచివాలయంలో రేపు ఉదయం 11.30  గంటలకు సమావేశమై విధివిధానాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు ఏపీ జెఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్.  పీఆర్సీ పై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమ వుతోందని.. గంభీర పరిస్థితిని అర్ధం చేసుకుని కలసి పని చేయాలని నిర్ణయించామని తెలిపారు ఏపీ జెఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్.  

పర్సనల్ అజెండా, అంతర్గత విబేధాలు పక్కన పెట్టాలని నిర్ణయించామని.. ఒకే తాటి పైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు బండి శ్రీనివాస్. మా పోరాటం  చరిత్ర లో  లిఖిం చేందుకు కారణమవుతుందని.. రేపటి నుంచి అందరిదీ ఒకటే మాట, ఒకే వాదన, ఒకటే డిమాండ్ ఉంటుందన్నారు.  ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను  పరిష్కరించాలని డిమాండ్ చేశారు బండి శ్రీనివాస్.   అందరి సమస్య కాబట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని.. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు  సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఐక్యమై ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించామని..  మెరుగైన పీఆర్సీ కోసం కలసి పోరాడాలని నిర్ణయించామని.. రేపు సచివాలయం లో సమావేశమై తదుపరి కార్యాచరణ రేపు ప్రకటిస్తామని హెచ్చరించారు వెంక ట్రామిరెడ్డి.మెరుగైన పీఆర్సీ సహా  ఎలాంటి డిమాండ్లు పెట్టాలనే అంశంపై చర్చిస్తాం.. ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మా జేఎసీ ల ఐక్య వేదిక లో చర్చిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: