ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఊహించనంత వేగంతో వచ్చిన రెండవ దశలో దేశం మొత్తం అల్లాడి పోయింది అన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం మూడవ దశ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగుతూ ఉండడం గమనార్హం.


 ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ కేసులు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు తీసుకొస్తూ ఉంది. ఎక్కడికక్కడ కరోనా వైరస్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో వైరస్ బారిన పడినప్పటికీ పరీక్షలు చేసుకోవడానికి భయపడుతున్న కారణంగానే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.


 ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికీ తిరుగుతూ  ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించానూన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమస్యల నివారణకు చర్యలు చేపట్టపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణం, గ్రామం లోని ప్రతి ఇంటికి కూడా ఆరోగ్య కార్యకర్తలు ఈరోజు రాబోతున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరి ఆరోగ్యంపై ఆరా తీయబోతున్నారు. ఇక స్వల్ప లక్షణాలు ఉంటే మందులు ఇవ్వడం తో పాటు అవసరమైతే అక్కడికక్కడే టెస్టులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: