సంక్రాంతి.. ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని ఇచ్చే సీజన్.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంక్రాంతిని మించిన సీజన్‌ లేదు. అయితే.. ఈ సంక్రాంతికి ప్రయాణికులను వారి వారి గ్రామాలకు చేర్చడంలో ఏపీఎస్‌ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ రెండూ బాగానే పోటీ పడ్డాయి. ఈ సంక్రాంతికి రెండు ఆర్టీసీలు కోట్ల రూపాయల ఆదాయం కళ్ల జూశాయి. టీఎస్ ఆర్‌టీసీకి సంక్రాంతి సందర్భంగా రికార్డ్‌ స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆ సంస్థ ఇటీవల తెలిపింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీఎస్ ఆర్‌టీసీ 4 వేలకు పైగా అదనపు బస్సులను నడిపించింది. టీఎస్ ఆర్‌టీసీ సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.


ఇలా ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు, 4 వేలకు పైగా అదనపు బస్సులను నడిపించిన టీఎస్ఆర్‌టీసీకి ఆదాయం కూడా రికార్డు స్థాయిలోనే వచ్చిందట. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపింది అదనంగా 4 వేలకు పైగా బస్సులను తిప్పింది.


అయితే.. ఏపీఎస్‌ ఆర్టీసీ.. ఆదాయంతో తెలంగాణను మించిపోయిందట. సంక్రాంతి పండుగకు ఎపీఎస్ ఆర్టీసీకి 144 కోట్ల ఆదాయం వచ్చిందట. పలు  ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ 5422 ప్రత్యేక బస్సులు నడిపింది. ఏపీ నుంచి హైదరాబాద్ కే 1350 బస్సులు నడిపిందట ఏపీఎస్‌ ఆర్టీసీ … ఈ నెల 7 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ... జనవరి 17ఒక్కరోజే 15.40కోట్ల ఆదాయం  సంపాదించిదట.


ఇక జనవరి 17న అత్యధిక సంఖ్యలో 36లక్షల మంది ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని ఆ సంస్థ ఎండి చెబుతున్నారు. ఇంకా కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా చెన్నై, బెంగళూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందట. లేకపోతే ఇంకాస్త అధికంగా ఆదాయం వచ్చేదని.. ఇంతగా
ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాల అని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: