ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌న మామూలుగా కొన‌సాగ‌డం లేదు. ఓవైపు క‌రోనా.. మ‌రొక‌వైపు ఒమిక్రాన్ వేరియ‌యంట్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ క‌ర్ప్యూ లాంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఏపీలో కూడా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. క‌రోనా కేసులు రోజు రోజుకు రెట్టింప‌వుతుండ‌టంతో నైట్ క‌ర్ప్యూ మ‌రింత ప‌క‌డ్బందీగా పోలీసులు అమ‌లు చేస్తూ ఉన్నారు.

మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీలు మిన‌హా ఎవ‌రైనా రాత్రి 11 గంట‌ల‌కు దాటిన త‌రువాత రోడ్ల‌పై క‌న‌బ‌డితే తాట తీస్తున్నారు పోలీసులు.  ముఖ్యంగా రాత్రి పూట ఫుడ్ కోర్టుల‌ను సైతం 10 గంట‌ల‌లోపు మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసారు.  ఫుడ్ కోర్టు అన‌గానే రాత్రిళ్లు నిత్యం ర‌ద్దీగా ఉండే బెజ‌వాడ రోడు్ల గుర్తుకు వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం నైట్ క‌ర్ప్యూ కార‌ణంగా బెజ‌వాడలోని అన్ని ప్ర‌ధాన ఫుడ్ కోర్టుల‌పై ఆంక్ష‌లు పెట్ట‌డంతో ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. న‌గ‌ర వ్యాప్తంగా ఎక్కడిక‌క్క‌డ బారికేడ్లు ఏర్పాటు చేసి క‌రోనా క‌ట్ట‌డి చేస్తున్నారు.

బెజ‌వాడ‌లోని నైట్ క‌ర్ప్యూ అమ‌లులో ఉన్న త‌రుణంలో ఫుడ్ కోర్టుల ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. క‌రోనా భ‌యంతో జ‌నాలు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదని.. రాత్రి స‌మ‌యంలోనే ఎక్కువ‌గా గిరాకీ ఉంటుంద‌ని.. నైట్ క‌ర్య్పూ కార‌ణంగా ముందుగానే.. మూసివేయ‌డంతో ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నామ‌ని పేర్కొన్నారు.

నైట్ క‌ర్ప్యూ కార‌ణంగా రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పోలీసులు సైతం ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. నైట్ క‌ర్ప్యూ ప‌క్కాగా అమ‌లవుతోంది. క‌ర్ప్యూ స‌మ‌యంలో రోడ్ల‌పైకి రావ‌ద్దు అని.. వ‌చ్చిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం అని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. ప్ర‌జ‌లెవ‌రైనా మాస్క్ లేకుండా బ‌య‌ట తిరిగిన‌ట్ట‌యితే.. పోలీసులు కొర‌డా ఝులిపిస్తున్నారు. జ‌రిమానాలు భారీగా వ‌సూలు చేస్తూ ఉన్నారు. ఓవైపు క‌రోనా.. మ‌రొక వైపు ఒమిక్రాన్ విజృంబిస్తున్న త‌రుణంలో అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని అధికారులు, పోలీసులు ప‌దే ప‌దే చెబుతున్నా.. కొంద‌రూ నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తున్న‌ద‌ని పేర్కొంటున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: