కోతుల బెడద నివారణ పై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ సమీక్ష నిర్వహించారు. కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు .. ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం చేశామని... తెలంగాఆణ రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు ఉన్నాయని మంత్రి నిరంజన్ పేర్కొన్నారు. కోతులకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయిస్తామని.. ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిరంజన్. ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలన చేస్తున్నామని.. పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉందన్నారు మంత్రి నిరంజన్. రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలని... చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారని స్పస్టం చేశారు మంత్రి నిరంజన్.

కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు మంత్రి నిరంజన్. పంటల వై విద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని... అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా పెంచాలన్నారు మంత్రి నిరంజన్. పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని.. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల లో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలని స్తున్నాయని చెప్పారు. రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలన్నారు మంత్రి నిరంజ న్ రెడ్డి. తెలంగాణ స్టేట్ ముఖ్య మంత్రి కేసీఆర్ గారి  ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రుల భేటీ అయింది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: