తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు  బండి సంజయ్ కుమార్ పై దాడి ఘటనలో పోలీసులకు సమన్లు జారీ  అయ్యాయి. బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించింది లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారాయణ సహా బాధ్యులైన ఇతర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది.   ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.  పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపైన, ఎంపీపైన దాడి చేసిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది ప్రివిలేజ్ కమిటీ. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి బండి సంజయ్ ను అరెస్టు చేయడంపట్ల  సీరియస్  అయింది.


బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ.  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సైతం తనపై దాడిని, అరెస్టును తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చింది బండి సంజయ్.  తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని సైతం ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తెచ్చిన బండి సంజయ్... చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎంపీ వాదన విన్న కొద్ది గంటల్లోనే సమన్లు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ.  తన పై, ఎంపీ కార్యాలయం పై దాడి చేసిన మరికొందరి పోలీస్ అధికారుల పేర్లను ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు బండి సంజయ్.  ఫిబ్రవరి 3న ఢిల్లీకి రావాలంటూ వారందరికీ సమన్లు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ. సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబాద్‌   పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాస్‌, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె. శ్రీనివాస రావు, కరీంనగర్‌ ఐ-టౌన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చలమల్ల నటేష్‌లకు సమన్లు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ.


మరింత సమాచారం తెలుసుకోండి: