పోరుబాట పట్టాల్సిన కమ్యూనిస్టులు రివర్స్ బాటలో వెళుతున్నారు ? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వరుస ఘటనలే కారణంగా కనిపిస్తోంది. ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పోరు చేస్తున్న వేళ కమ్యూనిస్టులు చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏమా ప్రకటన ?
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగులూ ఇద్దరు కూడా సమస్యల పరిష్కారం పై తెగేవరకూ లాగవద్దని సిపిఐ జాతీయ నేత నారాయణ పేరుతో ఒక ప్రకటన శనివారం మీడియాకు అందింది. ఉద్యోగులు సమ్మెకు మద్దుతు ఇస్తున్నామని చెబుతూనే, మరో వైపు ఇరువర్గాలు కూడా సమస్యలను తెగే వరకూ లాగవద్దని హితవు  పలకడం పై ఉద్యోగ సంఘాలు నోసలు చిట్లించాయి. సిపిఐ నారాయణ ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారా ? లేదా అని  పలు సంఘాలు ఆలోచనలో పడ్డాయి. అదే ప్రకటనలో ఉద్యోగులు రాజకీయ పార్టీలను అంటరానివారుగా చూడ వద్దని కూడా  హితవు పలికారు. ఇది కూడా ఉద్యోగ వర్గాలలో చర్చనీయాంశ మైంది. ఉద్యోగులకు తమ మద్దతు ఉందని, వారి ఐక్య కార్యాచరణకు మద్దతు నిస్తామని చెబుతూనే  హితవు వాక్యాలు పలకడం పై ఉద్యోగ సంఘాలు తమలో తాము చర్చించుకుంటున్నాయి.. సిపిఐ నేత నారాయణ ప్రకటన పై ఉద్యోగ సంఘాలు ఇంకా ఏ విధమైన స్పందనా వెలవరించ క పోవడం గమనార్హం. వాస్త వానికి ఉద్యోగ సంఘాలు గత కొద్ది రోజులుగా  పోరుబాట పట్టాయి. ఉద్యోగ సంఘాల నేతలు వివిధ పార్టీలతో మమేకమై ఉన్నారు కూడా. అయితే వారు తమ కోర్కోల సాధన కోసం తమ పార్టీ జండాలను, వేదికలను  వినియోగించుకోలేదు. సహజంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఉద్యమం అయినా కూడా కమ్యూనిస్టుల ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఉద్యోగ సఘాలు తమ పోరును దశల వారీ గా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కూడా అదే సమయంలో తన బాటలో తాను నడుస్తానని చెప్పకనే చెప్పింది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో  కాలం నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: