తెలుగు రాష్ట్రాలలో మొదట పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు కేవలం వారం వ్యవధి లోనే వందకు చేరుకున్నాయి. ఆ తరవాత మరో వారానికి వేల సంఖ్యను దాటుతున్నాయి.  ఇవన్నీ చూస్తుంటే వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అనేది అర్దం చేసుకోవచ్చు. అయితే ఈ మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని విడిచి పెట్టేలా లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసులు చూస్తే వాటిలో ఎక్కువగా ఒమిక్రాన్  కేసులు అధికంగా ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత బాధలోనూ ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏమిటంటే... కరోనా సెకెండ్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్పీడ్ గా ఉన్నా,  ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉంది అంటున్నారు డాక్టర్లు.

అంతే కాకుండా ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా తక్కువ గానే ఉంటుంది, అది కూడా రెండు డోసులు టీకా తీసుకోని వారు.. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ, గుండె జబ్బులు వంటి దీర్ఘ కాలిక సమస్యలతో  బాధపడే వారు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ  త్వరగానే కోలుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి ఒమిక్రాన్ వస్తే ఆందోళన పడకండి అని అంటున్నారు వైద్యులు. ప్రతి రోజూ మీకు ఇచ్చిన మందులను వాడుతూ, తగిన ఆహార నియమాలు పాటించండి. అలాగే టెన్షన్ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే త్వరగానే దీని బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు.

ఎంత ప్రమాదమైన వ్యాధి లేదా వైరస్ అయినా వచ్చిన తర్వాత ఇబ్బంది పాడడం కన్నా, అది రాకుండా ముందు గానే జాగ్రత్త తీసుకోవడం మంచిది. దానికి మించిన మందు లేదు, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ నియమాలు పాటించండి. మీ పిల్లల్ని సైతం కరోనా నియమాలు పాటించేలా చూసుకోండి. ఇంకా రెండు నెలలు అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: