ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఏ నోట విన్నా మాకు జలుబు, జ్వరం ఇది కరోనానే అంటూ కంగరు పడుతున్నారు. వ్యాప్తి వేగం స్పీడ్ గా ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేదు వైరస్ నిర్దారణ అయిన వారం రోజులకే నెగెటివ్ వచ్చేస్తుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని... కొందరు నిపుణులు చెబుతున్నా మన కంగారు మనకి ఉండనే ఉంటుంది. ప్రస్తుతం చిన్నారులు సైతం ఎక్కువగా కరోనా భారిన పడుతున్నారు. అయితే తాజాగా స్కూల్స్ కరోనా కలకలం మొదలయ్యింది, విద్యార్థులు వరుసగా వైరస్ బాధితులుగా మారుతున్నారు.

ఏపి లోని ఒక స్కూల్ లో ఏకంగా 147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది . ఇందులో 18 విద్యార్థులు కాగా మిగిలిన.. 54 మంది టీచర్లు, నలుగురు ఇతర సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్థాయిలో పాఠశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇపుడు స్కూల్స్ ని తాత్కాలికంగా కొన్ని రోజులు క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త కరోనా వలన ప్రమాదం పెద్దగా లేక పోయినా ఇలాగే వ్యాప్తి మరింత వేగం పుంజుకుంటే పరిస్థితులు మారుతాయేమో అన్న ఆందోళనలో అందరూ ఉన్నారు.

దాంతో సర్కారు సైతం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పాఠశాలలను కొన్ని రోజులు మూసి వేయడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై పిల్లల తల్లితండ్రులు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రెండు రోజుల క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏ పాఠశాలలో కరోనా వచ్చినా ఆ పాఠశాల వరకే మూసి వేస్తాము, మిగిలిన స్కూల్స్ కొనసాగిస్తాము అన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటారా అని తెలుస్తోంది. ఈ అంశం పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: