కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ వ్యాక్సిన్ అనేది తప్పనిసరి గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక చిన్న వ్యాక్సిన్ ప్రస్తుతం ఏకంగా ఆరు అడుగుల మనిషికి రక్షణ కల్పిస్తోంది. ఇక ప్రాణాలను తీసే మహమ్మారి కరోనా వైరస్ నుంచి పోరాటం చేయడానికి ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు వాక్సిన్ విషయంలో ఎన్నో అనుమానాలు అపోహలను వ్యక్తం చేసిన జనాలు ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ఇక ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా అటు ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.



 ఇక గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతటా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ అందిస్తూ ఉండటం కూడా గమనార్హం. ఇలా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడంలో ఆరోగ్య కార్యకర్తలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కానీ కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మాత్రం వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వీడటం లేదు. కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఎంతో మంది చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది అనే చెప్పాలి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.


 మూడు నెలల క్రితం చనిపోయిన మహిళకు ఇటీవలే రెండవ డోసు వ్యాక్సిన్ ఇచ్చారు ఆరోగ్య కార్యకర్తలు. ఈ ఘటన కాస్తా ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. యూపీలోని మహోబా లో ఈ ఘటన జరిగింది. 3 నెలల క్రితం చనిపోయిన మహిళలకు రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు మెసేజ్ రావడం తో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సీరియస్గా స్పందించింది. విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హేమలత అనే మహిళ మూడు నెలల క్రితం మరణించగా.. ఇటీవలే ఆమె రెండో డోస్ తీసుకున్నట్లుగా చిన్న మేనల్లుడి మొబైల్ కి మెసేజ్ రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: