జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్లి జరుగుతుంది.. అందుకే పెళ్లిని సమయం సందర్భం చూసుకుని అంగరంగ వైభవంగా చేసుకోడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇటీవల కాలంలో అయితే సామాన్యులు సైతం సర్వాంగ సుందరంగా  ముస్తాబు చేసిన మండపంలో పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అందరి కంటే కాస్త భిన్నంగా పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఒకప్పుడు అయితే వధూవరులు నేరుగా వచ్చి మండపం లో కూర్చునే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం వధూవరులు మండపానికి వచ్చే ముందు డ్యాన్స్ లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.


 ఇలా ప్రస్తుతం పాపులర్ గా మారిపోయిన ఎన్నో పాటల పై డాన్సులు చేస్తూ పెళ్లి మండపాలకు ఎంట్రీ ఇస్తున్నారు వధూవరులు. ఇలా డాన్సు చేస్తున్న వీడియో లు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ గా మారిపోయాయి. ఇక అచ్చం ఇలాగే తమిళనాడులోని కడలూరు లో ఒక పెళ్లి జరిగింది. నేటి రోజుల్లో ట్రెండ్ ను ఫాలో అవుతూ పెళ్లికూతురు పెళ్లి మండపం లోకి డాన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇలా డాన్స్ చేయడమే వివాహం ఆగిపోవడానికి కారణం అయింది. పెళ్లి కూతురు డాన్స్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు ఏకంగా అందరిముందే చెంప చెల్లుమనిపించాడు.



 కడలూరు కి చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తెకు కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ జరిగగా.. ఇటీవల జనవరి 20వ తేదీన వివాహం నిశ్చయించారు. బంధు మిత్రులందరికీ నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చారు. ఇక పెళ్లి మండపానికి వచ్చే సమయంలో పెళ్లి కూతురు తన బంధువులతో కలిసి డ్యాన్స్ చేసుకుంటూ వేదిక వరకు వచ్చింది. పెళ్లి కూతురు డాన్స్ చేయడం వరుడికి మాత్రం నచ్చలేదు. దీంతో కోపాన్ని పట్టలేకపోయాడు. దీంతో ఎందుకు డాన్స్ చేసావు అంటూ అందరి ముందు నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇక విచక్షణ  కోల్పోయిన వరుడు వధువు చెంప చెల్లుమనిపించాడు. ఆ అమ్మాయి కూడా అతని చెంప పగల గొట్టింది. ఇదంతా వధువు తండ్రి ముందే జరిగింది. ఇలాంటి అల్లుడు నాకొద్దు అంటూ వరుడు తరపు బంధువులు అందరికీ పంపించేశాడు. ఇక వారి బంధువుల లోనే ఒక అబ్బాయిని చూసి అదే ముహూర్తానికి పెళ్లి చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: