తెలంగాణ బీజేపీలో అసమ్మతి క్రమంగా ముదురుతోంది. నాయకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు తమకు ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రహస్యం మీటింగ్ కు కూడా పెట్టుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది సీనియర్ల సమాధానం కోసం అధిష్టానం ఎదురు చూస్తోందని టాక్.

అయితే బీజేపీకి అంతో ఇంతో బలంగా ఉన్నా కరీంనగర్ నియోజకవర్గంలోనే ఈ ధిక్కార స్వరాలు రావడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్  కు బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక సీట్ ను గెలుచుకున్న కమలం పార్టీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అయితే కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ఒకే ఒక ఎమ్మెల్యే సీటు ఉన్న బిజెపి దుబ్బాక, హుజురాబాద్ సీట్లను గెలుచుకుంది. అంతేకాకుండా జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెండో పార్టీగా అవతరించింది. అయితే కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ ను టార్గెట్ చేసుకొని సీనియర్లంతా ఒక్కటయ్యారు. అయితే అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డికి అప్పగించారు. దీంతో వారిని హైదరాబాద్ పిలిపించారు. అయితే ఆ తర్వాత వారి దిక్కార స్వరం అక్కడితో ఆగిపోలేదు.సీనియర్లంతా ఒక్కరొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో అంతా చెప్పేస్తున్నారు. తమకు షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతామని అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఎప్పటినుంచో పట్టుంది. గతంలో విద్యాసాగర్ రావు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ధిక్కారస్వరం ఎదుర్కొన్నారు. 2014 ఎలక్షన్ ల సమయంలో పార్టీ బండి సంజయ్, రామకృష్ణారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అందుకు రామకృష్ణ రెడ్డినే కారణమని ఓ ఆరోపణ. అయితే 2019 లో బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత అనూహ్యంగా అతనికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ పటిష్ట  స్థాయికి చేరుతోంది.

 అప్పటి నుండి బండ సంజయ్ ను రామకృష్ణారెడ్డి టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ బిజెపి సీనియర్లను ఒక గూటికి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇందులో భాగంగా రామకృష్ణా రెడ్డి వర్గం ఆర్ఎస్ఎస్ కు ఫిర్యాదు కూడా చేసింది. అయితే బండి సంజయ్ కూడా ఎంపీగా పోటీ చేసిన సమయంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు. ఈ పరిణామాలు బిజెపి ఎదుగుదలకు ప్రతి బంధంకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: