ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ?

త్వరలోనే ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే... ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల  పై నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. తాజాగా “కోవిడ్” వ్యాప్తి కట్టడికి “నిషేధం” నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఐదు రాష్ట్రాలతో వరుస “వీడియో కాన్ఫరెన్స్”లను నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రచార సభలు, “రోడ్ షో” ల పై విధించిన నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం....  కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు, 5 రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రానుంది.  


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న   ప్రకటిస్తూ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర  ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత, మరలా జనవరి 22 వ తేదీ ( ఈ రోజు) వరకు నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ రోజు మరోసారి సమీక్షించి నిషేధం కొనసాగించాలా, లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం.... అయుతే, రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఇక ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి వివరాలు ఇం కా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: