గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ కేసులను గుర్తించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ అది సాధారణ జ్వరం అంటూ భావిస్తూ కొంతమంది టెస్టులు చేయించుకోకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంది అని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



 మొన్నటి ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేయించేలా ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. ఇక ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించింది.  ఈ క్రమంలోనే ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఇక రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులు గురించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆరోగ్య కార్యకర్తలు అందరూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రోజున చేపట్టిన ఫీవర్ సర్వే లో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.



 ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు నిర్వహించిన ఫీవర్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఏకంగా 45 వేల మందికి  వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక వారందరికీ కూడా కరోనా వైరస్ చికిత్స కు కావాల్సిన హోం ఐసోలేషన్ కిడ్స్కిట్స్ అందజేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వే దాదాపు ఆరు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది.  ప్రతి ఇంటికి చేరుకొని ఆరోగ్య కార్యకర్తలు ఆ కుటుంబం లో ఉన్న వ్యక్తుల వివరాలను ఆరోగ్య పరిస్థితిని అడిగి  తెలుసుకో బోతున్నారు. ఇంకా అవసరమైతే అక్కడికక్కడే కరోనా వైరస్ పరీక్షలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: