కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ  పై సంచలన కామెంట్స్‌ చేశారు  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ అరుణ్ సింగ్.  ఏపీ లో 1న జీతం రావడం లేదు....పింఛన్ ఇవ్వడం లేదు...ఏపీ లో ఖజానా ఖాళీ అయింది...ప్రభుత్వం దివాళా తీసిందని మండిపడ్డారు అరుణ్ సింగ్. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని.. ఏపీ ప్రభుత్వం  పీఆర్ సి ద్వారా  వేతనం పెంచకుండా తగ్గించిందని పేర్కొన్నారు అరుణ్ సింగ్. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని.. ఏపీ లో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవన్నారు అరుణ్ సింగ్. అఖిలేష్ హయాంలో యూపీ మంత్రి అజాం ఖాన్ చాలా ఏళ్లుగా జైలులో వున్నారని.. ఎన్ని నేరాలు చేసినా ముస్లిం లపై చర్యలు తీసుకోరాదన్న ఫలితమే యూపీ మంత్రి అజాం ఖాన్ జైలులోనే వున్నారని చెప్పారు అరుణ్ సింగ్.  

ఏపీ లో భజన, యజ్ఞం చేయడం, విగ్రహాల వద్ద నిరసన తెలిపి సీఎం జగన్ కు సద్బుద్ధి వచ్చేలా చేయండన్నారు అరుణ్ సింగ్. సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నా..బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అడ్డుకునేందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అరుణ్ సింగ్. బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించమని... పి ఎఫ్ ఐ, ఎస్డీపి ఐ ఏపీలో ధౌర్జన్యాలపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు అరుణ్ సింగ్.  కర్ణాటక లో పి ఎఫ్ ఐ, ఎస్డీపి ఐ ని సీఎం సిద్ధరామయ్య ప్రోత్సహించి దౌర్జన్యాలపై చర్య తీసుకొనేందుకు జనం ప్రభుత్వాన్ని కాదని బీజేపీ కి అధికారం ఇచ్చారన్నారు అరుణ్ సింగ్.  వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించాలి...బీజేపీ తో జగన్ కు పరాచకాలు వద్దని చెప్పారు అరుణ్ సింగ్.  కోవిడ్ లేకుంటే వేలాది మంది వచ్చి దురాగతాలు అడ్డుకునేవారని చెప్పారు అరుణ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp