తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి 16 నెలలు గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను వివిధ శాఖల్లో అలాట్ చేయ డానికి అడుగులు ముందుకు వేస్తోంది. వీఆర్వోలను సర్దుబాటు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  గతంలో వ్యవసాయ శాఖలో సర్దుబాటు చేస్తారని భావించి నప్పటికీ మరోసారి మున్సిపల్ శాఖలో సర్దుబాటు చేయనున్నారన్న వార్తలతో విఆర్వో లు కలవర పడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోంది. రాష్ట్రంలో విధులు లేకుండా ఐదు వేల 756 మంది విఆర్వో లు ఖాళీగా ఉన్నారు. వారిలో కొంతమందిని మున్సిపల్ శాఖ లో కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీలోని పలు పోస్టుల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావి స్తుందట. ఇప్పటికే మున్సిపల్ శాఖలో ఖాళీల నివేదికను పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి అందించారు. దీంతో మున్సిపాలిటీలలో బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు,వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల్లో వీఆర్వోలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అడు గులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దగ్గరికి ఫైల్ చేరినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ ఉద్యోగుల్లో కొన సాగుతుంది.

ఇదిలా ఉంటే తమను మున్సిపల్ శాఖలో సర్దుబాటు చేస్తే  సర్వీస్ తో పాటు సీనియారిటీ ఇబ్బందులు వస్తాయంటున్న వీఆర్వోలు. అందుకే తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. విల్లింగ్ ఉన్న విఆర్వో లకు ఆప్షన్ల ద్వారా సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు అన్యా యం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు  వీఆర్వోలు. మున్సిపల్ శాఖలో తమను సర్దుబాటు చేస్తే కొత్తగా మున్సిపల్ చట్టాలను చదవడం మొదలు పెట్టలేం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: